జగ్గారెడ్డి సంచలనం .. రాహుల్ రాజీనామా వెనుక వ్యూహం వుంది

సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి విజయం సాధిస్తామని భావించిన కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా దెబ్బ తింది. దీంతో పార్టీ జాతీయాధ్యక్షుడిగా పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ రాజీనామా చేశారు. అయితే రాహుల్ రాజీనామా ఉపసంహరించుకోవాలని ఏఐసీసి కోరుతుంది. ఇక ఈ నేపధ్యంలో సంగా రెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి రాహుల్ రాజీనామాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాహుల్ గాంధీ రాజీనామా వెనుక వ్యూహం ఉందన్నారు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి, రాహుల్ రాజీనామా అంశాలపై స్పందించిన ఆయన.. పార్టీ ప్రక్షాళన చేయాలన్నది రాహుల్ ఉద్దేశ్యమన్నారు. అందులో భాగంగానే రాహుల్ రాజీనామా చేశారని చెప్పారు.

Jaggareddys sensation ..there is a strategy behind rahuls resignation

ఎవరితో పార్టీ ఎదుగుతుంది అనేది ఆయన ఆలోచన అన్నారు. రాజీనామా చేయటం అంటే వెనక్కి తగ్గటం కాదని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. గాంధీ కుటుంబం లేకుండా కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధ్యం కాదని జగ్గారెడ్డి అన్నారు.గాంధీ కుటుంబం ఓ వ్యవస్ధ అని.. ఆ కుటుంబం ఓ సమాజమని జగ్గా రెడ్డి పేర్కొన్నారు . గాంధీ కుటుంబాన్ని వ్యక్తులుగా కాక వ్యవస్థగా చూడాలని జగ్గారెడ్డి సూచించారు. కాంగ్రెస్‌కు సీనియర్లు, యువత ఇద్దరి అవసరం ఉందన్నారు జగ్గా రెడ్డి .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+