వైఎస్ జగన్, షర్మిలపై జగ్గారెడ్డి తీవ్రవ్యాఖ్యలు; ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పుపైనా సంచలనం!!

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వైయస్ జగన్, వైయస్ షర్మిల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా సంగారెడ్డి నియోజక వర్గంలో పర్యటిస్తున్న వైయస్ షర్మిల తాను వైయస్సార్ వదిలిన బాణాన్ని అని చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. జగ్గారెడ్డిని టార్గెట్ చేసిన షర్మిలపై ఘాటుగా స్పందించారు. షర్మిల ఆనాడు పాదయాత్ర చేస్తూ జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పిందని, ఇక ఇప్పుడు ఇక్కడ దస్తీ వేసి వైయస్ వదిలిన బాణాన్ని అని చెబుతోందని జగ్గా రెడ్డి మండిపడ్డారు.

వైఎస్ బొమ్మ పెట్టుకున్న జగన్, షర్మిల ఆయన ఆశయం కోసం పని చెయ్యటం లేదు

వైఎస్ బొమ్మ పెట్టుకున్న జగన్, షర్మిల ఆయన ఆశయం కోసం పని చెయ్యటం లేదు

రాహుల్ గాంధీ ప్రధాని కావాలని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆకాంక్షించారు అని పేర్కొన్న జగ్గారెడ్డి , వైయస్సార్ బొమ్మ పెట్టుకుని ఆయన కొడుకు, కూతురు ఆయన ఆశయం కోసం పనిచేయడం లేదని నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు పై స్పందించిన ఆయన వైయస్సార్ యూనివర్సిటీ అని పేరు మార్చి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తప్పని స్పష్టం చేశారు.

వైయస్సార్ పరువు మీరే తీస్తున్నారు.. రివర్స్ ఎటాక్ చేసిన జగ్గారెడ్డి

వైయస్సార్ పరువు మీరే తీస్తున్నారు.. రివర్స్ ఎటాక్ చేసిన జగ్గారెడ్డి

ఇక ఇదే సమయంలో ఆనాడు వైఎస్ కూడా కొన్ని తప్పిదాలు చేశారని పేర్కొన్న జగ్గారెడ్డి టిఆర్ఎస్ పార్టీలో ఉన్న తనను కాంగ్రెస్ పార్టీ లోకి తీసుకుని వెళ్లి పార్టీ ఫిరాయింపులు మొదలు పెట్టింది వైయస్ రాజశేఖర్ రెడ్డి అని వెల్లడించారు. తనకు పార్టీ మారే ఆలోచన లేకున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీలోకి వైయస్సార్ తీసుకువెళ్లారని జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారడం కోసం ఎటువంటి పైరవీలు చేయలేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. షర్మిల వైఎస్ఆర్ ను తిట్టే అవకాశం ఇస్తున్నారని పేర్కొన్న జగ్గారెడ్డి, మమ్మల్ని తిట్టి మాతో మీ తండ్రిని తిట్టించి వైయస్సార్ పరువు మీరే తీస్తున్నారు అంటూ మండిపడ్డారు.

సీఎం కుర్చీ కోసం అన్నాచెల్లెళ్ళు స్కెచ్ వేశారు

సీఎం కుర్చీ కోసం అన్నాచెల్లెళ్ళు స్కెచ్ వేశారు

వైయస్ షర్మిల ట్రైనింగ్ తీసుకుంటే మంచిదని, ఆమెకు సలహాలు ఎవరు ఇస్తున్నారో కానీ తప్పుడు సలహాలు ఇస్తున్నారు అంటూ మండిపడ్డారు. వైయస్ మరణిస్తే మేమంతా ఏడుస్తుంటే, ఆయన కొడుకు సీఎం కావాలని స్కెచ్ వేశారని, వైయస్ మీద తమకు అభిమానం ఉంది కానీ వైయస్ షర్మిల కు, జగన్ కు లేదని జగ్గా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. షర్మిల, జగన్ ఇద్దరు సీఎం కుర్చీ కోసం స్కెచ్ వేసుకున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు పార్టీ పెట్టిందో? ఇక్కడ ఎందుకు తిరుగుతుందో తెలియదని పేర్కొన్న జగ్గారెడ్డి వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా రెడ్డి కాంగ్రెస్ కు వెళ్లి వచ్చారని షర్మిలకు తెలియదేమో అంటూ ఎద్దేవా చేశారు.

ఎన్టీఆర్ పేరు తీసి హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టటం తప్పు

ఎన్టీఆర్ పేరు తీసి హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టటం తప్పు

ప్రపంచ వ్యాప్తంగా పేరు గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్న ఆయన, హెల్త్ యూనివర్సిటీ కి ఎన్టీఆర్ పేరు తీసి వైఎస్ఆర్ పేరు పెట్టడం తప్పని వ్యాఖ్యానించారు. అలాంటి నిర్ణయాన్ని ఎవరూ అంగీకరించరని, దీనిని తన ఖండిస్తున్నానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. వైయస్ కూతురు అయితే ఏదిపడితే అది తమను అంటే ఊరుకుంటామా అంటూ ప్రశ్నించిన జగ్గారెడ్డి, మమ్మల్ని తిట్టడం మానేసి ప్రజలకు ఏం చేస్తావో చెబుతూ ప్రచారం చేసుకోమంటూ హితవుపలికారు. జగన్, షర్మిల ఇద్దరు బీజేపీ వదిలిన బాణాలని పేర్కొన్న జగ్గారెడ్డి షర్మిల బిజెపిని ఎందుకు తిట్టడం లేదో చెప్పాలని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+