'పాకిస్తాన్‌పై మోడీ అలా, తెలంగాణలో కేసీఆర్ ఇలా, దేశంలో అలాంటి సీఎం ఇతనే'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పైన తెలంగాణ కాంగ్రెస్ నేతలు జైపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తదితరులు తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ సర్కార్ ప్రజలను అంశాల వారీగా విభజిస్తోందని జైపాల్ రెడ్డి ధ్వజమెత్తారు.
చరిత్ర తెలియని వారు బీజేపీలో నాయకులుగా ఉన్నారన్నారు. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయినా మారడం లేదన్నారు. ఇండియన్ ఆర్మీని ప్రధాని మోడీ ఇజ్రాయెల్ సైన్యంతో పోల్చడం సరికాదన్నారు.
మోడీ ప్రభుత్వం సైన్యాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఆరెస్సెస్ శిక్షణ వల్లే సర్జికల్ దాడులు అని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ చెప్పడం విడ్డూరమన్నారు. గతంలోను సర్జికల్ దాడులు జరిగాయన్నారు. కానీ ఇప్పుడే జరిగినట్లు బీజేపీ ప్రచారం చేస్తోందన్నారు.

ఎన్నికల హామీలలో బీజేపీ విఫలమైందన్నారు. అందుకే పాకిస్తాన్‌తో యుద్ధం వస్తే లబ్ధి పొందాలని చూస్తోందన్నారు. గతంలో ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలు ధైర్యంగా పాక్‌తో యుద్ధం చేశారన్నారు. మత నియమాలను కూడా బీజేపీ రాజకీయాలకు వాడుకుంటోందన్నారు.
కామన్ సివిల్ కోడ్ పైన అన్ని పార్టీలతో చర్చించాలన్నారు. ఏకాభిప్రాయం కుదిరితే తేవాలి తప్ప ఒక మతం పైన కామన్ సివిల్ కోడ్ రుద్దితే కాంగ్రెస్ పార్టీ అంగీకరించదన్నారు. నల్లధనం పేరుతో చిన్న వ్యాపారులకు నోటీసులు ఇస్తున్నారన్నారు. దళితుల పైన దాడి జరిగితే తలదించుకుంటానని చెప్పిన మోడీ, గుజరాత్‌లో దళితుల ఊచకోత జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదన్నారు.
బ్రిక్స్ డిక్లరేషన్‌లో సిరియా ప్రస్తావన ఉంది తప్ప పాకిస్తాన్ ప్రస్తావన లేదని ఇది మోడీ దౌత్య వైఫల్యం కాదా అని మండిపడ్డారు. దేశంలో వలసలను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే అన్నారు. ఏకంగా ముఖ్యమంత్రే ఇలా ఫిరాయింపులు ప్రోత్సహించడం ప్రజాస్వామ్యానికి దుర్దినం అన్నారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications