బీఆర్‌ఎస్‌తో పొత్తు పై జానారెడ్డి కీలక వ్యాఖ్యలు - రేవంత్ నిర్ణయం ఏంటి..!!

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. తమ పార్టీ నేత రాహుల్ పై అనర్హత వేటును ఖండిస్తూ ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. ఇదే అంశం పైన మాట్లాడిన జానారెడ్డి బీఆర్ఎస్ పొత్తు పై సానుకూలంగా స్పందించారు. బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు అనేది.. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. బీజేపీపై పోరుకు ఎన్నికలకు సంబంధం లేదన్నారు.బీఆర్ఎస్ లక్ష్యంగా రేవంత్ టీం పోరాటం చేస్తున్న సమయంలో ఇప్పుడు జానారెడ్డి చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం మొదలైంది.

రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ - కాంగ్రెస్ మధ్య పొత్తుకు సంబంధించి కొంత కాలంగా చర్చ సాగుతోంది. వరంగల్ లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ పొత్తులకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ సైతం బీఆర్ఎస్ తో పోరాటమే కానీ, పొత్తులు ఉండవని పలు మార్లు స్పష్టం చేసారు.

ఇప్పుడు తాజాగా పార్టీ సీనియర్ నేత జానారెడ్డి మోదీ పాలనపై ప్రజలు గొంతు విప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలన్నారు. కాగా పొత్తులపై జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పరోక్షంగా కాంగ్రెస్ - బీఆర్ఎస్ కలుస్తాయనే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Jana Reddy Sensational comments on Congress and BRS alliance

కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి ఇదే తరహాలో వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ - బీఆర్ఎస్ కలిసే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ థాక్రే జోక్యంతో కోమటిరెడ్డి ఆ వ్యాఖ్యలను ఉప సంహరించుకున్నారు. అటు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ను ఓడించి అధికారం దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సమయంలో సీనియర్లు కొందరు బీఆర్ఎస్ తో పొత్తు గురించి చేస్తున్న వ్యాఖ్యలతో పార్టీ నేతలకు రుచించటం లేదు. ఈ వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారి తీస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లోనూ దాదాపుగా మెజార్టీ ప్రతిపక్ష పార్టీలు రాహుల్ పైన అనర్హత అంశాన్ని తప్పు బట్టాయి. కలిసి కట్టుగా నిరసనల్లో పాల్గొంటున్నాయి. ఇప్పుడు జానా రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు కారణమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+