సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళుతున్నారా? ఒక్క నిముషం
దీపావళి, ఛాట్ పండగలకు ఉండే రద్దీ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి బీహార్ లోని రక్సాల్ కు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఇవి కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముద్కేడ్, నాందేడ్ మీదగా రాకపోకలు సాగిస్తాయి. ఈ జనసాధారణ్ లో అన్నీ జనరల్ బోగీలే ఉంటాయి. ఒక్కో రైలులో 22 బోగీలుంటాయి. ఇవి మొత్తం అన్ రిజర్వుడే. వాటిల్లో 2400 మంది ప్రయాణించవచ్చు.
సికింద్రాబాద్ నుంచి రక్సాల్ (నెం.07007) ఈనెల 12, 19 తేదీల్లో ఉదయం 10.30 గంటలకు జన సాధారణ్ బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో రక్సాల్ నుంచి(నెం.07008) 14, 21 తేదీల్లో బయలుదేరతాయి. తెలంగాణలోని బొలారం, మేడ్చల్, అక్కన్నపేట, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముద్కేడ్ స్టేషన్లలో హాల్ట్ ఉంటుంది. రిజర్వేషన్ తో సంబంధం లేకుండా వీటిలో ప్రయాణం చేయవచ్చు. సికింద్రాబాద్ వంటి పెద్ద స్టేషన్ లో ఉండే రద్దీని దృష్టిలో ఉంచుకొని యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా టికెట్లు తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించే దిశగా భారతీయ రైల్వే పలు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. వీటి తర్వాత త్వరలోనే వందే సాధారణ్ రైళ్లు, వందే భారత్ స్లీపర్ రైళ్లు రానున్నాయి. వందే సాధారణ్ లో జనరల్, స్లీపర్ బోగీలు మాత్రమే ఉంటాయి. వందే భారత్ స్లీపర్ రైళ్లు ఎక్కువ దూరం ప్రయాణించేవారికి సౌలభ్యం కోసం తీసుకురానున్నారు. వందే భారత్ రైళ్లల్లో ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయనే ఫిర్యాదులు వస్తుండటంతో సాధారణ ఛార్జీలతో వందే సాధారణ్ తీసుకొస్తున్నారు.












Click it and Unblock the Notifications