ఇలాంటి ప్రచారాలు ఎవరూ నమ్మవద్దు, ఏం చేసినా ప్రకటిస్తాం: జనసేన
Recommended Video

జనసేన బహిరంగ సభ : ప్రజల్లో హాట్ టాపిక్
హైదరాబాద్: జనసేన పార్టీకి సంబంధించిన కమిటీలు అంటూ జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ స్పందించింది. కమిటీలపై వచ్చిన వార్తలు అవాస్తవం అని పేర్కొంది.
పార్టీ కమిటీల నియామకంపై కసరత్తు కొనసాగుతోందని ఆ పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది. తమ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అధికారికంగా ప్రకటిస్తుందని పేర్కొంది. ఇటువంటి ప్రచారాలన్నీ ఎవరూ నమ్మొద్దని, ఏళ్ల తరబడి కష్టపడుతున్న నిజమైన కార్యకర్తలను పార్టీ గుర్తిస్తుందని పేర్కొంది.

పార్టీ శ్రేణులు ఎటువంటి గందరగోళానికి గురికావొద్దని సూచించింది. కాగా, సోషల్ మీడియాలో జనసేన పార్టీపై పుకార్లు వచ్చాయి. కొన్ని రోజులుగా జనసేన కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది.












Click it and Unblock the Notifications