తెలంగాణపై పవన్ కొత్త స్కెచ్, కీలక నిర్ణయం- అసలు టార్గెట్ ఆ పార్టీనే..!?
జనసేనాని పవన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏపీలో కూటమిలో భాగస్వామిగా ఉన్న పవన్ తెలంగాణ కేంద్రంగా కొత్త స్కెచ్ సిద్దం చేస్తున్నారు. బీజేపీ తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. దీంతో.. పవన్ సైతం తన రూటు తాను డిసైడ్ చేస్తున్నారు. అందులో భాగంగా సామాజిక సమీకరణాల ఆధారంగా కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు. పవన్ టార్గెట్ ఫిక్స్ అయింది. దీంతో.. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.
తెలంగాణలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న రాజకీయంతో బీజేపీ పోటీ పడుతోంది. తామే తిరిగి అధికారంలోకి వస్తామని సీఎం రేవంత్ పదే పదే చెబుతున్నారు. తాము తిరిగి అధికారంలోకి రావటం ఖాయమని బీఆర్ఎస్ నేతలు ధీమాగా ఉన్నారు. ఇదే సమయంలో బీజేపీ సైతం తమ పట్టు పెంచుకునే వ్యూహాలను అమలు చేస్తోంది. బీజేపీ అధినాయకత్వం సైతం తెలంగాణ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేయటంతో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కాగా.. ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. బీజేపీ తాము ఒంటరిగానే పోటీ చేస్తామని చెబుతున్న వేళ.. పవన్ సైతం తమ పార్టీ సింగిల్ గా కంటెస్ట్ చేసేందుకు సమాయత్తం కావాలని నిర్దేశిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు.

పవన్ వ్యూహాలు ఫలిస్తాయా
జనసేన తెలంగాణ నేతలు పార్లమెంటరీ వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికలకు సమాయత్తం కావాలని నిర్దేశిస్తున్నారు. పవన్ కల్యాణ్ త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటన లకు సిద్దం అవుతున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు. గ్రేటర్ తో సహా అన్ని ఎన్నికల్లోనూ పార్టీ పోటీలో ఉంటుందని ప్రకటించారు. ఏపీలో స్థానిక సంస్థలు పూర్తయిన తరువాత పవన్ తెలంగాణ పైన ఫోకస్ చేస్తారని.. అందులో భాగంగా ముందుగా గ్రేటర్ లో పార్టీ బలోపేతం పైన నిర్ణయాలు ఉంటాయని... అదే విధంగా ప్రతీ పార్లమెంట్ పరిధిలోనూ పార్టీ సమావేశాల నిర్వహణకు వీలుగా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. పవన్ రాజకీయం బీఆర్ఎస్- కాంగ్రెస్ లక్ష్యంగా సాగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే.. పవన్ తీసుకుంటున్న తాజా నిర్ణయాలు రాజకీయంగా జనసేనకు ఎంత వరకు కలిసి వస్తాయి.. తెలంగాణలో ఎలాంటి ప్రభావం చూపుతాయనే చర్చ రాజకీయంగా ఆసక్తిగా మారుతోంది.













Click it and Unblock the Notifications
