తెలంగాణలో గెలిచేదెవరు, అనూహ్యంగా - తాజా సర్వే సంచలనం..!!
తెలంగాణలో ఎన్నికల హీట్ పెరిగిపోతోంది. అధికారం నిలబెట్టుకొనేందుకు బీఆర్ఎస్..ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ,బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. హ్యాట్రిక్ విజయం కోసం సీఎం కేసీఆర్ సుడిగాలి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సెంటిమెంట్ గా భావించే రాజశ్యామల యాగం ప్రారంభించారు. అటు కాంగ్రెస్ లో చేరికలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో ప్రముఖ సర్వే సంస్థ తెలంగాణలో గెలుపు ఎవరిదో..పబ్లిక్ మూడ్ ఏంటో వెల్లడించింది. అనూహ్య అంచనాలను ప్రకటించింది.
ఎన్నికల రాజకీయం : తెలంగాణ పోలింగ్ డేకు కౌంట్ డౌన్ మొదలైంది. దాదాపు అన్ని పార్టీల అభ్యర్దులు ఓటర్లను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. మరోసారి విజయం సాధించి దక్షిణాదిన వరుసగా మూడో సారి గెలిచిన సీఎంగా రికార్డు క్రియేట్ చేయాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కర్ణాటక లో విజయానికి కొనసాగింపుగా తెలంగాణలోనూ గెలవాలనేది కాంగ్రెస్ హైకమాండ్ టార్గెట్. తెలంగాణ లో తమ సత్తా చాటాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే, మారుతున్న పరిణామాల క్రమంలో పబ్లిక్ మూడ్ ఏంటనేది సర్వే సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధానంగా పోటీ బీఆర్ఎస్ వర్సస్ కాంగ్రెస్ ఉంటుందని తేల్చి చెబుతున్నాయి. అధికారంలోకి ఎవరు వస్తారనేది క్లారిటీ ఇస్తున్నాయి.

అధికారం దక్కేదెవరికి : ఇప్పటికే పలు సంస్థలు సర్వే నివేదికలు బయట పెట్టాయి. మెజార్టీ సంస్థలు తిరిగి తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కే పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నాయని వెల్లడించాయి. మరి కొన్ని సంస్థలు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని..కాంగ్రెస్ కు అనుకూలంగా పరిణామాలు మారుతున్నాయని విశ్లేషిస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ 'జనతా కా మూడ్' సర్వే సంచలన ఫలితాలను ప్రకటించింది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం లక్షా 20 వేల శాంపిల్స్ తీసుకొని.. రెండు నెలలపాటు సర్వే చేశామని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. సంస్థ అంచనాల ప్రకారం బీఆర్ఎస్ 41 శాతం ఓట్ షేర్ తో 72-75 స్థానాలతో తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనా వేసారు. కాంగ్రెస్ 34 శాతం ఓట్ షేర్ తో 31 -36 సీట్లు వస్తాయని సంస్థ అంచనా వేసింది.
కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ : బీజేపీ మూడో స్థానంలో నిలుస్తుందని ఈ సంస్థ వెల్లడించిన లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ 14 శాతం ఓట్లతో దాదాపుగా 4-6 స్థానాలు గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక ఎంఐఎం మూడు శాతం ఓటింగ్ తో 6-7 స్థానాలు గెలుస్తుందని విశ్లేషించారు. ఇతరులు 8 శాతం మేర ఓట్ షేర్ సాధిస్తారని అంచనా వేసారు. అయితే, బీఆర్ఎస్ - కాంగ్రెస్ మధ్య 7 శాతం ఓట్ షేర్ తేడా ఉన్నట్లు ఈ సర్వే చెబుతోంది. ఇతరులు సాధించే 8 శాతం ఓట్ షేర్ ఇక్కడ గెలుపు ఓటముల్లో కీలకం కానుంది. జనతా కా మూడ్ సంస్థ గతంలో 2015లో ఢిల్లీ, బీహార్ ఎన్నికలు.. 2016లో అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి ఎన్నికలు.. 2017లో పంజాబ్ ఎన్నికలకు ఈ సర్వే సంస్థ చెప్పినట్లుగానే.. ఇంచుమించు దగ్గరగానే ఫలితాలు వచ్చాయి. దీంతో, ఇప్పుడు ఈ సర్వే అంచనాలు వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications