అఫైర్: భార్యను, సహోద్యోగిని చంపిన తెలంగాణ జవాను
జమ్ము: ఓ సిఐఎస్ఎఫ్ జవాను తన యూనిట్‌లో ముగ్గురిని కాల్చి చంపాడు. భార్యను, తన సహోద్యోగిని, మరొకరిని అతను కాల్చి చంపాడు. ఈ సంఘటన జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ర జిల్లాలో జరిగింది.
ఈ సంఘటన గురువార తెల్లవారు జామున 2 గంటలకు జరిగింది. కిష్త్వార్ జిల్లాలోని ధులస్తి వద్ద గల ఎన్‌హెచ్‌పిసి పవర్ ప్లాంట్ వద్ద అతన్ని నియోగించారు. తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే ఆగ్రహంతో అతను ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు చెబుతున్నారు.

షాలిమార్ చౌక్‌లో గల తన నివాసిత యూనిట్‌లో సర్వీస్ వెపన్‌తో కాల్పులు జరిపాడు. అతన్ని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు.
నిందితుడైన జవానను సస్పెండ్ చేసినట్ల, రెండు కుటుంబాలకు చెందిన నలుగురు పిల్లలను తాము చూసుకుంటామని సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఓపి సింగ్ పిటిఐకి తెలిపారు.
ఈ నేరానికి పాల్పడిన ఐ సురిందర్ 2014లో సిఐఎస్ఎఫ్‌లో చేరాడు. అతను తెలంగాణకు చెందినవాడు. మృతులను రాజేష్, శోభలుగా గుర్తించారు.












Click it and Unblock the Notifications