తెలంగాణ రచయితల వేదికకు జయధీర్ (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రచయితల వేదిక నూతన కార్యవర్గ ఎన్నిక హైదరాబాదు కాచిగూడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఆదివారం జరిగింది. అధ్యక్షుడిగా ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావును, ప్రధాన కార్యదర్శిగా జాజోజి నాగభూషణాన్ని ఎన్నుకున్నారు. ఎన్నిక అనంతరం తిరుమలరావు మాట్లాడారు.
తమ వేదిక ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని కలిసికట్టుగా పని చేసి వాటిని అధిగమించి ప్రజల తరపున పోరాడతామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి, సాహిత్యం, భాషకు తీరని అన్యాయం జరిగిందని, స్వరాష్ట్రంలో వాటికి పూర్వవైభవం తేవడానికి కృషి చేస్తామని అన్నారు.
అవసరమైతే ఇందుకు నూతన విధానాలను రూపొందిస్తామన్నారు. ప్రజలందరికీ సమన్యాయం అందించే తెలంగాణ కోసం పోరాడుతామని, మరో ఉద్యమం చేయడానికైనా వెనకాడబోమన్నారు. తెలంగాణ రచయితల వేదిక అఖిల భారత అధ్యక్షుడిగా జూకంటి జగన్నాథం, ప్రధాన కార్యదర్శిగా సంగినేని రవీంద్ర ఎన్నికయ్యారు.

తెరవే కార్యవర్గ భేటీ
తెలంగాణ రచయితల వేదిక (తెరవే) కార్యవర్గ సమావేశం ఆదివారం హైదరాబాదులో జరిగింది. నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

అధ్యక్షుడిగా జయధీర్ తిరుమల రావు
తెలంగాణ రచయితల వేదిక కొత్త అధ్యక్షుడిగా ప్రముఖ రచయిత, పరిశోధకుడు జయధీర్ తిరుమల రావు ఎన్నికయ్యారు.

తెరవే సమావేశం
తెరవే కార్యవర్గ సమావేశం ఆదివారంనాడు హైదరాబాదులోని కాచిగుడాలో గల ఓ ప్రైవేట్ కళాశాలలో జరిగింది.

పాత, కొత్త కార్యవర్గ నేతలు
తెలంగాణ రచయితల వేదిక కొత్త, పాత కార్యవర్ద నేతలు ఇలా సమావేశం తర్వాత కనిపించారు.












Click it and Unblock the Notifications