సికింద్రాబాద్, చర్లపల్లి నుంచి ఈ రూట్లలో ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!

తెలంగాణలోని సికింద్రాబాద్ (Secunderabad), చర్లపల్లి (Charlapalli) స్టేషన్ల నుంచి శ్రీకాకుళం( Srikakulam), షాలిమార్ (Shalimar) స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే ఓ గుడ్ న్యూస్ చెప్పింది. రద్దీగా ఉంటే ఈ రెండు రూట్లలో ప్రయాణికుల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే నడుపుతున్న ప్రత్యేక రైళ్లను (Special Trains) మరికొంతకాలం పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రైళ్లను ఎప్పటివరకూ పొడిగించారు, ఇతర వివరాలను అధికారులు విడుదల చేశారు.

ముందుగా షాలిమార్ నుంచి చర్లపల్లికి ప్రస్తుతం ప్రతీ శుక్రవారం నడుపుతున్న ప్రత్యేక రైలు, అలాగే చర్లపల్లి నుంచి షాలిమార్ కి ప్రతీ శనివారం నడుపుతున్న మరో ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. షాలిమార్ నుంచి చర్లపల్లికి నడుపుతున్న రైలును ఈ నెల 3, 10, 17, 24, 31 తేదీల్లోనూ కొనసాగించాలని నిర్ణయించారు. అలాగే చర్లపల్లి నుంచి షాలిమార్ కు నడుపుతున్న మరో ప్రత్యేక రైలును ఈ నెల 4, 11, 18, 25, ఆగస్టు 1 న కూడా నడపాలని నిర్ణయించారు.

Special Trains Between Charlapalli-Shalimar Secunderabad-Srikakulam Extended Check New Dates

అలాగే సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం రోడ్ స్టేషన్ కు ప్రతీ ఆదివారం నడుపుతున్న ప్రత్యేక రైలు 07425ను ఈ నెల 5, 12, అలాగే ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 27 వరకూ నడపబోతున్నారు. దీంతో పాటు శ్రీకాకుళం రోడ్ స్టేషన్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ కు ప్రతీ సోమవారం నడుపుతున్న మరో ప్రత్యేక రైలు 07426ను సైతం ఈ నెల 6, 13, అలాగే ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 28 వరకూ నడపాలని నిర్ణయించారు. ఈ రైలులో ఐదు సెకండ్ ఏసీ, నాలుగు థర్డ్ ఏసీ, ఆరు స్లీపర్, నాలుగు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+