నరసాపురం-అరుణాచలం వీక్లీ ఇక రెగ్యులర్:షెడ్యూల్ ఇలా..!!

అరుణాచలం భక్తులకు రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఇప్పటి వరకు స్పెషల్‌ రైలుగా నడుస్తున్న నరసాపురం- అరుణాచలం (తిరువణ్ణామలై) ఎక్స్‌ప్రెస్‌ ఇక రెగ్యులర్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ నడవనున్నది. తొలి రెగ్యులర్‌ సర్వీస్‌ను భీమవరం టౌన్‌ రైల్వేస్టేషన్‌లో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. ఆక్యుపెన్సీ అంచనాలకు మించి ఉండటం తో ఈ సర్వీసును రెగ్యులర్ గా మార్పు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

నర్సాపురం నుంచి గత ఏడాది జూలై 9న తిరువణ్ణామలై స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించామని ఆక్యుపెన్సీ 110 శాతానికి చేరుకోవడంతో విషయాన్ని రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి దీనిని రెగ్యులర్‌ సర్వీస్‌గా మార్చాలని కోరామని మంత్రి శ్రీనివాస వర్మ చెప్పారు. ఇప్పుడు రెగ్యులర్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా మారడంతో ఇబ్బందులు ఉండవన్నారు. జూలై 10 నుంచి నరసాపురం-బెంగళూరు రెగ్యులర్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. రానున్నరోజుల్లో నరసాపురం నుంచి విశాఖపట్నానికి పగటిపూట రైలు సర్వీస్‌, తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్‌లో వందేభారత్‌కు హాల్ట్‌, నరసాపురం నుంచి వారాణసికి రైలు సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.

చెప్పినట్లుగానే వారికి పవన్ మార్క్ ట్రీట్మెంట్ షురూ..!!
చెప్పినట్లుగానే వారికి పవన్ మార్క్ ట్రీట్మెంట్ షురూ..!!
railways-announces-weekly-train-between-narsapuram-to-arunachalam-upgraded-as-regular-train-schedul

ప్రయాణీకులకు మరింత వెసులుబాటు

కాగా.. ఈ రైలు 12 కీలక స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. ఏపీలో పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట (ఆంధ్రప్రదేశ్) తమిళనాడులోని కాట్పాడి, తిరువణ్ణామలై (అరుణాచలం) మీదుగా వెళ్తుంది. ఈ మార్గం పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలను నేరుగా ఈ ఆధ్యాత్మిక క్షేత్రాలతో అనుసంధానంగా మారనుంది. అరుణాచలం వెళ్లాలంటే ఇప్పటివరకు చెన్నై లేదా విల్లుపురం వరకు రైలులో వెళ్లి అక్కడి నుంచి బస్సు మారాల్సి వచ్చేది. తాజాగా వీక్లీ వల్ల ప్రయాణ విధానం మారిపోనుంది. ఈ కొత్త ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ప్రయాణ సమయాన్ని దాదాపు 8 గంటల వరకు తగ్గిస్తుంది. వీక్లీ ఎక్స్‌ప్రెస్ వల్ల ఖర్చు సగానికి తగ్గనుంది. స్లీపర్ క్లాస్ ఛార్జీ సుమారు రూ.900 నుంచి రూ.1,100 వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అరుణాచలంలో జరిగే గిరిప్రదక్షిణ సమయాల్లో గోదావరి జిల్లాల నుండే నెలకు 10వేలకు పైగా భక్తులు వెళ్తుంటారు. ఇప్పుడు ఈ రైలు వారికి మరింత ప్రయోజనకరంగా మారనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+