నువ్వు మారవా ఇక.. ఐపీఎల్ వివాదం మళ్లీ రిపీట్! (వీడియో)
లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేష్ రాఠీ తన వివాదాస్పద నోట్‌బుక్ సెలబ్రేషన్స్‌తో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026లో ఓల్డ్ ఢిల్లీ 6, ఔటర్ ఢిల్లీ వారియర్స్ మధ్య జరిగిని మ్యాచ్‌లో ప్రియాన్ష్ ఆర్యను ఔట్ చేసిన తర్వాత ఐపీఎల్ 2025లో తనకు పెనాల్టీని తెచ్చిపెట్టిన అదే సెలబ్రేషన్‌ను దిగ్వేష్ రాఠీ రిపీట్ చేశాడు. ఈ సారి పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే వికెట్ తీసిన అనంతరం తన సహచరులతో కలిసి సంబరాలు చేసుకోకుండా దిగ్వేష్ రాఠీని పెవిలియన్‌కు తిరిగి వెళ్తున్న ప్రియాన్ష్ ఆర్య వైపు పరిగెత్తి.. అతని వద్దకు వెళ్లి నోట్‌బుక్ సెలబ్రేషన్ చేశాడు. ఈ ప్రవర్తనకు గాను డీపీఎల్ దిగ్వేష్ రాఠీపై ఏదైనా చర్య తీసుకుంటుందో లేదో వేచి చూడాలి.
ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఔటర్ ఢిల్లీ వారియర్స్ ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, యజస్ శర్మ ఓల్డ్ ఢిల్లీ 6 బౌలర్లను చితకబాదారు. పవర్ ప్లేలో ఇద్దరూ దూకుడుగా బ్యాటింగ్ చేసి జట్టును భారీ స్కోరు దిశగా నడిపించారు. కెప్టెన్ అనుజ్ రావత్ దిగ్వేష్ రాఠీకి బంతిని అప్పగించే సమయానికి స్కోరు వికెట్ నష్టపోకుండా 120 పరుగులుగా ఉంది. దిగ్వేష్ రాఠీ క్రీజులోకి వచ్చిన వెంటనే మ్యాచ్ గమనాన్ని మార్చేయాలని ప్రయత్నించాడు. దిగ్వేష్ తన మొదటి బంతికే ప్రియాన్ష్ ఆర్యను భారీ షాట్ ఆడేలా ఒత్తిడి చేశాడు. లాంగ్ ఆన్‌లో ఉన్న రోహన్ రాఠీ క్యాచ్ పట్టడంతో అతని ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత దిగ్వేష్ ప్రియాన్ష్ ఆర్య పైకి దూసుకెళ్లి.. తన నోట్‌బుక్ సెలబ్రేషన్‌ను ప్రదర్శించాడు.

ఐపీఎల్‌లో కూడా వీరిద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఈ సంబరానికి దిగ్వేష్ రాఠీ, ప్రియాన్ష్ ఆర్యల మధ్య చాలా కాలంగా సంబంధం ఉంది. ఐపీఎల్ 2025 సందర్భంగా దిగ్వేష్ రాఠీ బ్యాటర్లను ఔట్ చేసిన తర్వాత వారికి దగ్గరగా వెళ్లి నోట్‌బుక్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. ప్రియాన్ష్ ఆర్యపై కూడా ఇలాంటి ఘటనలే నమోదయ్యాయి. ఇలాంటి సంబరాలను నిరంతరం చేయడం, ఆటగాళ్లకు సెండాఫ్స్ ఇచ్చేటప్పుడు వారికి మరీ దగ్గరగా వెళ్లడం వంటి కారణాల వల్ల దిగ్వేష్ క్రమశిక్షణా చర్యలను ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో దిగ్వేష్ రాఠీకి జరిమానా విధించి ఓ మ్యాచ్‌కు సస్పెండ్ చేశారు.
ప్రియాన్ష్ ఆర్యను ఔట్ చేసిన తర్వాత దిగ్వేష్ రాఠీ అక్కడితో ఆగలేదు. రెండు బంతుల తర్వాత దిగ్వేష్ రాఠీ విధ్వంసకర బ్యాటర్ యజస్ శర్మను పెవిలియన్‌కు పంపాడు. యజస్ కేవలం 36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 86 పరుగులు చేశాడు. దిగ్వేష్ రాఠీ తన మొదటి ఓవర్లోనే కేవలం ఒక పరుగు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత దిగ్వేష్ ధ్రువ్ సింగ్‌ను కూడా ఔట్ చేసి తన 4 ఓవర్లలో 25 పరుగులకు 3 వికెట్లతో తన స్పెల్‌ను ముగించాడు. అయినప్పటికీ ఔటర్ ఢిల్లీ వారియర్స్ 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. అక్షయ్ సైని 23 బంతుల్లో అజేయంగా 49 పరుగులు చేయగా.. హర్ష్ త్యాగి 15 బంతుల్లో 32 పరుగులు చేశాడు.
220 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్యన్ గౌడ్, సమర్థ్ సేథ్‌ల ద్వారా ఓల్డ్ ఢిల్లీకి అద్భుతమైన ఆరంభం లభించింది. వారు 8.4 ఓవర్లలో 104 పరుగులు జోడించారు. సమర్థ్ సేథ్ 24 బంతుల్లో 42 పరుగులు చేయగా.. ఆర్యన్ గౌడ్ 37 బంతుల్లో 65 పరుగులు చేశాడు. అయితే మధ్య ఓవర్లలో వరుసగా వికెట్లు పడటంతో ఛేజింగ్ గాడి తప్పింది. అమన్ చౌదరి 4 వికెట్లు తీయగా.. హర్ష్ త్యాగి 3 వికెట్లు పడగొట్టాడు. 6 ఓవర్లలో ఓల్డ్ ఢిల్లీ కేవలం 198 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఔటర్ ఢిల్లీ వారియర్స్ 21 పరుగుల తేడాతో మ్యాచ్ ను గెలుచుకుంది.
Digvesh Rathi did the Prachi celebration after dismissing Priyansh Arya 🔥🤣 pic.twitter.com/myJD9DX1hk
— Indian Cricket Ministry (@Tejashyyyyyy) August 17, 2026














Click it and Unblock the Notifications