హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో వారికి ఉద్యోగాలు.. ఇది నిజంగా గ్రేట్ న్యూస్!
సమాజంలో వివక్షకు గురవుతున్న ట్రాన్స్ టెండర్లకు ఎట్టకేలకు మంచి రోజులు వస్తున్నాయి. వీరికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే వారి భవిష్యత్తుకు భరోసా అందిస్తోంది. హైదరాబాద్ మెట్రో రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు భద్రత కల్పించడానికి ట్రాన్స్ జెండర్ లను సిబ్బందిగా నియమించి వారి సాధికారతకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.
హైదరాబాద్ మెట్రో 20 మంది ట్రాన్స్‌జెండర్ లకు ఉద్యోగాలు
అందరికీ సురక్షితమైన, మరింత సమగ్రమైన మెట్రో ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా, హైదరాబాద్ మెట్రో 20 మంది ట్రాన్స్‌జెండర్ లకు భద్రతా సిబ్బందిగా అవకాశం ఇచ్చింది.ఇది మహిళల భద్రత మరియు సామాజిక సాధికారతను బలోపేతం చేస్తుంది. దేశంలోనే అత్యంత అధునాతన పట్టణ రవాణా వ్యవస్థ అయిన మెట్రో రైల్ రవాణాలో ట్రాన్స్ జెండర్ లకు స్థానం కల్పించడం ఒక స్ఫూర్తిదాయక నిర్ణయంగా ప్రస్తుతం చర్చ జరుగుతుంది.

ట్రాన్స్ టెండర్లకు అవకాశం కల్పించిన మెట్రో
హైదరాబాద్ మెట్రో రైలు 57 స్టేషన్లతో మూడు కారిడార్లలో పనిచేస్తుంది. ప్రతిరోజు దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులకు ఈ మెట్రో రైలు సేవలను అందిస్తుంది. ఈ ప్రయాణికులను దాదాపు 30 శాతం మంది మహిళలు ఉండగా, వారందరి భద్రతా, సౌకర్యం నిర్ధారించడం కోసం మెట్రో రైలు వ్యవస్థ ట్రాన్స్ టెండర్లకు అవకాశం కల్పించింది.
సేవా రంగాలలో ట్రాన్స్‌జెండర్ సిబ్బంది నియామకంపై ప్రత్యేక ప్రాధాన్యత
తెలంగాణ ప్రభుత్వం సమానత్వం, గౌరవం మరియు సమాన అవకాశాలకు కట్టుబడి ఉన్నాము అని మరోమారు ట్రాన్స్ టెండర్లకు అవకాశం కల్పించడం ద్వారా అందరికీ అర్థమయ్యేలా చెప్పింది. వివిధ ప్రజా సేవా రంగాలలో ట్రాన్స్‌జెండర్ సిబ్బంది నియామకంపై ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్టు తాజా చొరవతో అర్థమవుతుంది. హైదరాబాద్ మెట్రో రైలు తన భద్రతా విభాగంలో 20 మంది ట్రాన్స్‌జెండర్ సిబ్బందిని నియమించడం ద్వారా చాలా ప్రభావవంతమైన అడుగు వేసింది.
సామాజిక సాధికారతకు నిదర్శనంగా నిర్ణయం
ఈ ట్రాన్స్ జెండర్ లకు ప్రత్యేక శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి వివిధ మెట్రో స్టేషన్లలో విధులను కేటాయించింది. ఈ నిర్ణయం మహిళా ప్రయాణికులకు మొత్తం భద్రతా వాతావరణాన్ని బలోపేతం చేయడమే కాకుండా సామాజిక సాధికారతకు నిదర్శనంగా నిలిచింది. కొత్తగా నియమించబడిన ఈ ట్రాన్స్ జెండర్ భద్రత సిబ్బంది జనరల్ మరియు మహిళల కోచ్ లలో విధులను నిర్వర్తిస్తారు.
ట్రాన్స్ టెండర్లకు సమాజంలో సముచితమైన స్థానం
మీకు అవసరమైనప్పుడు ప్రయాణికులకు సహాయం చేస్తారు. వీరికి సురక్షితమైన, సుఖవంతమైన ప్రయాణాన్ని నిర్ధారించడానికి స్కానర్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. మొత్తంగా ఈ చర్య ద్వారా ట్రాన్స్ టెండర్లకు కూడా సమాజంలో సముచితమైన స్థానం దొరుకుతుందని అర్థమవుతుంది.
-
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications