Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నిజస్వరూపం బయటకొస్తుంది.. యాంకర్ ఝాన్సీ పోస్ట్ కు ఘాటుగా బదులిచ్చిన జానీ మాస్టర్

మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు జానీ మాస్టర్ జైలుకు వెళ్లిన వ్యవహారంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు ఆసక్తికర చర్చకు కారణంగా మారాయి. జానీ మాస్టర్ పైన యాంకర్ ఝాన్సీ సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో చర్చకు కారణమైంది. యాంకర్ ఝాన్సీ పెట్టిన పోస్ట్ పైన డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఘాటుగా స్పందించారు.

తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తే జాలేస్తుంది
తప్పుడు ప్రచారాలు చేసే వారిని చూస్తుంటే జాలేస్తోందని ఆయన అన్నారు. త్వరలోనే నిజా నిజాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్ల పైన కూడా తప్పుడు ప్రచారాలు చేసే వారిని చూస్తుంటే తనకు జాలేస్తోందన్నారు. తనకు తెలియకుండా జరిగిన యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి పెట్టిన కేసుకు సంబంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా వచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతున్నారన్నారు.

Johnny Master responded strongly to Anchor Jhansi post

ఆ రోజు మీ నిజస్వరూపం తెలుస్తుంది
మీరేదో చెప్పిన ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారేమో కానీ అసలు తీర్పు వివరాలు బయటకు వచ్చిన రోజున మీ నిజ స్వరూపం ఏంటో, దేనికోసం మీరు ఈ దుష్ప్రచారం చేస్తున్నారో అందరికీ అర్థమవుతుందన్నారు. ఇక ఆ రోజు ఎంతో దూరంలో లేదని న్యాయమే గెలుస్తుందని నిజం అందరికీ తెలుస్తుందని జానీ మాస్టర్ పేర్కొన్నారు.

జానీ మాస్టర్ కు కోర్టు షాక్ ఇచ్చిందన్న ఝాన్సీ పోస్ట్
అంతకుముందు సోషల్ మీడియా వేదికగా యాంకర్ ఝాన్సీ జానీ మాస్టర్ మధ్యంతర పిటిషన్ ను జిల్లా కోర్టు కొట్టి వేసిందని లైంగిక ఆరోపణల కేసులో జానీ మాస్టర్ పైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ గెలిచిందని సంచలన పోస్ట్ పెట్టారు. లైంగిక ఆరోపణల కేసు విషయంలో తెలుగు ఫిల్మ్ చాంబర్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించిన జానీ మాస్టర్ కు కోర్టులో ఎదురు దెబ్బ తగిలిందని యాంకర్ ఝాన్సీ పోస్ట్ పెట్టారు.

ఝాన్సీ పోస్ట్ కు జానీ మాస్టర్ కౌంటర్
మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా కోర్టు ఇచ్చిన తీర్పు కీలకమైన తీర్పు అని ఝాన్సీ వెల్లడించారు. కోర్టు మరోసారి మహిళల భద్రతకు ప్రాధాన్యతను ఇస్తుందని స్పష్టతనిచ్చిందని ఆమె తెలిపారు. పనిచేసే ప్రదేశాల్లో మహిళలకు భద్రత ప్రధానమని POSH మార్గదర్శకాలను అమలు చేసే సంస్థలకు ఎప్పుడు మద్దతు ఉంటుందనేది ఈ తీర్పుతో రుజువైందని యాంకర్ ఝాన్సీ వెల్లడించారు.. ఇక ఈ పోస్టు నేపథ్యంలోనే జానీ మాస్టర్ ఆమెకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+