తెలంగాణకు కేంద్రం భారీ శుభవార్త

తెలంగాణకు కేంద్రం భారీ శుభవార్త చెప్పింది. తెలంగాణకు ఎరువుల కొరత తీరుస్తామని పేర్కొంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి వినతికి కేంద్ర ప్రభుత్వం స్పందించింది. తెలంగాణ రైతులకు ఎరువుల కొరత లేకుండా అన్ని విధాలా సహకారం అందిస్తామని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి దిల్లీ టూర్ బిగ్ సక్సెస్ అయింది. తెలంగాణకు ఎరువుల కొరత తీరుస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణ రైతులకు ఎరువుల కొరత లేకుండా అన్ని విధాలా సహకారం అందిస్తామని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి నడ్డాతో సమావేశం అయ్యారు.

తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఈమేరకు నడ్డాను కోరారు. మంగళవారం దిల్లీలోని కేంద్ర మంత్రి అధికారిక నివాసంలో జరిగిన సమావేశంలో రేవంత్ రెడ్డి ఈ విజ్ఞప్తి చేశారు. వానా కాలం సీజన్‌ కు సంబంధించి ఏప్రిల్- జూన్ నెలల మధ్య 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, కేవలం 3.07 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారని సీఎం రేవంత్ నడ్డా దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు నీరు చేరి, సాగు పనులు జోరుగా సాగుతున్న సమయంలో యూరియా సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని కోరారు.

ఈ మేరకు ఖరీఫ్ సీజన్‌ కు సంబంధించి జూలై, ఆగస్టు నెలల్లో యూరియాను నిరాటంకంగా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తిపై స్పందించిన కేంద్ర మంత్రి నడ్డా రైతుల అవసరాలను తీర్చడానికి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ కు అవసరమైన మేరకు సరఫరా ఉండేలా చూసుకోవాలని ఎరువుల శాఖ అధికారులను ఆదేశించారు.

యూరియాను వ్యవసాయేతర అవసరాలకు మళ్లించకుండా, రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సమానంగా ఎరువులు పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కోరారు. ఇదే సమయంలో తెలంగాణలో యూరియా వినియోగం పెరుగుతుండటంపై కేంద్ర మంత్రి నడ్డా ఆందోళన వ్యక్తం చేశారు.

JP Nadda Assures Telangana Farmers No Fertilizer Shortage with Full Support

2023-24 యాసంగి తో పోలిస్తే 2024-25 యాసంగి లో యూరియా అమ్మకాలు 21% అధికమయ్యాయని అన్నారు. రసాయన ఎరువుల అధిక వినియోగాన్ని తగ్గించి, సేంద్రీయ, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం ప్రణామ్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రోత్సాహకాలు అందిస్తుందని ప్రస్తావించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+