జూబ్లీహిల్స్‌లో చేతులెత్తేసిన బీఆర్ఎస్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారత రాష్ట్ర సమితి చేతులెత్తేసింది. పోలింగ్ జరుగుతున్న సమయంలోనే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తిగా నీరు గారి పోయారు. జరుగుతున్న పోలింగ్ సరళి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండటం, ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదవడం ఆ పార్టీని తీవ్రంగా నిరాశపరిచింది అంతేకాకుండా ఓటింగ్ మొదలైనప్పటి నుంచి భారత రాష్ట్ర సమితి శ్రేణులు కాంగ్రెస్ పార్టీపై ఆరోపణ చేస్తూ వచ్చాయి నైతికంగా గెలుపు మాదేనని కాంగ్రెస్ పార్టీది కాదని పరోక్షంగా ఆ పార్టీ నాయకులు అంగీకరించారు ఓటర్లకు డబ్బులు పంచారని అధికారం ఉందని ఇష్టానుసారంగా ప్రవర్తించారని జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో కల్స్ ఎక్కువగా ఉన్నారని బీఆర్ఎస్ నేతలు గోల చేశారు.
పోలింగ్ ట్రెండును పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీఆర్ఎస్ కు అర్థం కావడంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు వాస్తవానికి ఈ ఎన్నికల్లో పోలింగ్ సర్వే బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉండి ఉంటే ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు వేరుగా మాట్లాడి ఉండేవారు.

పోల్ మేనేజ్మెంట్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ విజయవంతమైంది . ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ యాదవ్ కు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఉన్న బస్తీల్లో మంచి పట్టు ఉంది. దీంతో తన అనుచరుల ద్వారా బస్తీల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ కేంద్రానికి తీసుకు రాగలిగారు. డివిజన్లో ఏ ఓటర్ కూడా కాంగ్రెస్ పార్టీ తమ నిర్లక్ష్యానికి గురి చేసిందని ఆలోచించలేదు అయితే ఓటింగ్ సైలెంట్ గా జరిగిందని అది చంకే విజయాన్ని కట్టబెడుతుందని బీఆర్ఎస్ నమ్మకంతో ఉంది అయితే ఆ పార్టీకి ఉంది ఆత్మ లేదంటే డాంబికాలు పోతుందా అనేది 14వ తేదీన తెలుస్తుంది.
వాస్తవానికి ఎన్నికల ప్రచారంలో భారత్ రాష్ట్ర సమితి వ్యూహాత్మకంగా ముందడుగు వేసినట్లు కనపడింది అయితే ఆ వ్యూహం పోల్ మేనేజ్‌మెంట్లో కనపడలేదు కాంగ్రెస్ పార్టీ దూకుడు కనబడింది.బీఆర్ఎస్ నేత హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు డబ్బులు పంచుతోందంటూ ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేశారు. పోలింగ్ జరుగుతున్న రోజు ఏ పార్టీ అయినా ఇలా గోల చేయటంపై ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయటం ఆరోపణలు చేయటం లాంటివన్నీ పరిశీలిస్తే పోలింగ్ సరళిలో తాము ఎంతో వెనకబడ్డామని ఆ పార్టీకి స్పష్టంగా అర్థమవుతుంది.
ఇలా అర్థమవ్వటం వల్లే ఆరోపణలు చేస్తుంటారు పోల్ మేనేజ్‌మెంట్ అంటే ఏమీ లేదు తమకు ఓటేసే ప్రజలను జాగ్రత్తగా మేనేజ్ చేసుకుని వారిని పోలింగ్ కేంద్రానికి తెచ్చుకోవటమే. ఆ పని కాంగ్రెస్ చేసింది గాని బీఆర్ఎస్ చేయలేకపోయింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో నాలుగు లక్షల ఓట్లు ఉంటే కేవలం 45% ఓటింగ్ మాత్రం ఈ పోరాటం ఓటర్లలో ఉన్న నిరాసక్తతను తెలియజేస్తుంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ శ్రేణులు సరెండర్ అయ్యాయా లేదంటే బీఆర్ఎస్ పార్టీకి 14వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications