నిమ్స్‌లో జూనియర్ డాక్టర్ ఆత్మహత్య: ఏమైందో మరి తెలియదు
హైదరాబాద్: నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో ఓ జూనియర్ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. నరాలు, నాడీ వ్యవస్థపై అతనికి పట్టు ఉందని చెబుతారు. శివతేజ రెడ్డి అనే ఆ డాక్టర్ ఆదివారం క్లబ్‌లోని తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలన్మరణం చెందాడు.
రోగులకు చికిత్స అందిస్తూనే తన సొంత డబ్బులతో వారికి సదుపాయాలు కూడా కల్పించేవాడు. అటువంటి సామాజిక స్పృహ కలిగిన వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన ఎఫ్‌సిఐ రిటైర్డ్ ఉద్యోగి పులగం అప్పిరెడ్డి, కవిత దంపతుల కుమారుడు శివతేజ రెడ్డి. అతనిది 31 ఏళ్ల వయస్సు. ఏలూరు ఆశ్రమ్ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్, కింగ్ జార్జ్ ఆస్పత్రిలో ఎండి పూర్తి చేశాడు.
మహారాజా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (మిమ్స్)లో శివతేజ రెడ్డి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ సూపర్ స్పెషాలిటీ కోర్టు చదివాడు. తిరుపతిలో నెఫ్రాలజీ విభాగంలో సీటు సంపాదించాడు. నెఫ్రాలజీ విభాగంలో 8 నెలలు పనిచేసిన తర్వాత మళ్లీ పరీక్ష రాసి నిమ్స్ న్యూమరాలజీ విభాగంలో సీటు సంపాదించాడు.
అతను నిరుడు సెప్టెంబర్‌లో హైదరాబాదు వచ్చాడు.అప్పటి నుంచి వారం రోజుల క్రితం వరకు బయటే ఉంటూ నిమ్స్‌లో విధులకు హాజరయ్యేవాడు. విధులు ముగిసిన తర్వాత సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ ఎక్కువగా గ్రంథాలయంలో గడిపేవాడు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications