Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సూసైడ్ చేసుకున్న కబాలీ నిర్మాత కేపీ చౌదరి.. కారణాలివే!

సినీ నిర్మాత, డ్రగ్స్ కేసులో పట్టుబడిన కేపీ చౌదరి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఖమ్మం జిల్లాకు చెందిన కేపీ చౌదరి 2016లో సినీరంగంలోకి వచ్చి కబాలి సినిమాకు తెలుగులో నిర్మాతగా వ్యవహరించారు. నిర్మాతగా సినీ పరిశ్రమలో నిలుదొక్కుకోవాలని ప్రయత్నం చేసిన కేపీ చౌదరి అందులో విఫలం అయ్యారు. ఆ తరువాత డ్రగ్స్ కేసులో పట్టుబడటం, ఆర్థిక ఇబ్బందులతో గత కొంతకాలంగా బాధపడుతున్నారు.

రజనీకాంత్ సినిమా నిర్మాత కేపీ చౌదరి సూసైడ్
ఆర్థిక ఇబ్బందులు, డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం వంటివి ఆయన సూసైడ్ చేసుకోవడానికి కారణాలు అయ్యి ఉండొచ్చని కేపీ చౌదరి తరుపు బంధువులు భావిస్తున్నారు. నేడు ఉదయం గోవాలో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు. 2016 సంవత్సరంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి మూవీ తెలుగు వెర్షన్ కు కేపీ చౌదరి నిర్మాతగా వ్యవహరించారు.

kabali producer kp chowdary committed suicide these are the reasons

గోవాలో పబ్ పెట్టిన కేపీ చౌదరి.. నష్టాలతో డ్రగ్స్ దందాలోకి
అయితే ఆ సినిమా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. దీంతో కేపీ చౌదరి నష్టాల పాలయ్యారు. ఆయన తెలుగు, తమిళంలో అనేక సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా కూడా పనిచేశారు. సర్దార్ గబ్బర్ సింగ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అర్జున్ సురవరం వంటి సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. ఇక నిర్మాతగా సినిమాలలో సక్సెస్ కాలేకపోయిన ఆయన గోవాలో ఒక పబ్ ను ప్రారంభించారు. పబ్ లో కూడా నష్టాలు రావడంతో డ్రగ్స్ దందాలోకి దిగారు .

డ్రగ్స్ కేసులో పట్టుబడిన నిర్మాత
తనకు సినీ పరిశ్రమలో ఉన్న పరిచయాలతో సెలబ్రిటీలకు డ్రగ్స్ విక్రయం చేస్తున్నారు. ఇక 2023 సంవత్సరంలో డ్రగ్స్ కేసులో కెపి చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు.వరలక్ష్మీ టిఫిన్స్ డ్రగ్స్ కేసులో కేపీ చౌదరిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా నుండి 100 ప్యాకెట్ల కొకైన్ తెచ్చి సరఫరా చేస్తూ ఆయన పట్టుబడ్డారు. పోలీసులు ఆయనను పట్టుకున్నప్పుడు ఆయన వద్ద 90 ప్యాకెట్ల కొకైన్ దొరికింది.

తీవ్ర ఆర్ధిక ఇబ్బందులతో సూసైడ్ చేసుకున్న కేపీ చౌదరి
మరో 10 ప్యాకెట్లు ఎవరికి విక్రయించారు అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేశారు. అనంతరం బెయిల్ పైన విడుదలైన ఆయన గోవాలోనే నివాసం ఉంటున్నారు. ఇక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కేపీ చౌదరి సోమవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని పోలీసులు ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+