ఎంపీ పదవికి కడియం రిజైన్, 'ఫ్రెండ్‌గా రేవంత్‌కు అండగా ఉంటా'
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పార్లమెంటు సభ్యుడు వినోద్ గురువారం నాడు రాజ్ భవన్‌లో భేటీ అయ్యారు. గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా మాత్రమే కలిసినట్లు వారు చెప్పారు.
ఇవాళ కడియం రాజీనామా
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ రోజు తన ఎంపీ పదవికి రాజీనామా రాజీనామా చేశారు. ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. సాయంత్రం ఐదు గంటలకు లోకసభ సభాపతి సుమిత్రా మహాజన్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని అందచేశారు.

కేసీఆర్ పైన నాగం భగ్గు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి గురువారం మండిపడ్డారు. రాజ్యాంగ విరుద్ధంగా 13 మంది ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకోవడం సరికాదన్నారు.
కేసీఆర్ తీరు పైన కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ఓ స్నేహితుడిగా రేవంత్ రెడ్డికి తాను అండగా నిలబడతానని చెప్పారు. మిత్రపక్షంగా పార్టీ ఆదేశాల మేరకు పని చేస్తానని, రేవంత్ రెడ్డికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని చెప్పారు.
అందుకే వచ్చాం: గంటా
రేవంత్ రెడ్డికి పార్టీ అండగా ఉంటుందని ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు చెప్పారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన రేవంత్ కుమార్తె నైమిషా రెడ్డి నిశ్చితార్థానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రేవంత్‌కు, ఆయన కుటుంబానికి ఆత్మస్థైర్యం ఇచ్చేందుకే వచ్చామన్నారు. రేవంత్ నిర్దోషఇగా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications