ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో కీలక పరిణామం, ఇక నెక్స్ట్...!!
తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. మున్సిపల్ ఎన్నికలు.. ఫోన్ ట్యాపింగ్ కేసు.. మరో వైపు ఎమ్మెల్యే అనర్హత కేసు లతో సమీకరణాలు మారుతున్నాయి. కొత్త రాజకీయం తెర మీదకు వస్తోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరటంతో వారి పైన అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీ ఫిర్యాదు చేసింది. ఏడుగురికి క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ మిగిలిన ముగ్గురి విషయంలోనూ వివరణ తీసుకుంటున్నారు. ఇక, ఇప్పుడు స్పీకర్ మరో ఎమ్మెల్యే విషయంలో నిర్ణయానికి సిద్దమయ్యారు.
ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 4న (బుధవారం) ఉదయం 11గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా స్పీకర్ ఆదేశించారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద స్పీకర్ కు ఫిర్యాదు చేసారు. దీంతో, బుధవారం ఉదయం 11 గంట లకు జరగబోయే విచారణకు హాజరు కావాలని వివేకానందకు కూడా స్పీకర్ నోటీసులు జారీ చేశారు. కడియం శ్రీహరి, వివేకానంద వాదనలను స్పీకర్ ప్రసాద్ కుమార్ వివరణ తీసుకునే అవకాశం ఉంది. కాగా.. పార్టీ ఫిరాయింపుల కేసులో భాగంగా.. పది మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లు తన ముందుకు రాగా.. ఇప్పటికే ఏడుగురికి స్పీకర్ ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. వారు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని, కాంగ్రెస్ పార్టీలో చేరలేదని తీర్పు ఇచ్చారు. అయితే, దానం నాగేందర్ పిటిషన్ విచారణ దశలో ఉంది.

స్పీకర్ నిర్ణయం పై ఉత్కంఠ
కాగా, ఇప్పుడు కడియం శ్రీహరి పిటిషన్ ను బుధవారం విచారించను న్నారు. మరో ఎమ్మెల్యే సంజయ్ వ్యవహారంపై స్పీకర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ గుర్తుపై గెలిచిన కడియం శ్రీహరి, రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తన కుమార్తె కావ్య భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కారు గుర్తుపై గెలిచి హస్తం గూటికి చేరడం నిబంధనలకు విరుద్ధమని, ఆయనపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన స్పీకర్ కార్యాలయం, సహజ న్యాయ సూత్రాల ప్రకారం ఇరు పక్షాల వాదనలు వినాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే కడియం శ్రీహరితో పాటు, ఫిర్యాదుదారుడైన వివేకానందకు కూడా నోటీసులు అందాయి. రేపటి విచారణలో ఫిరాయింపునకు సంబంధించిన ఆధారాలను వివేకా సమర్పించనున్నారు. దీంతో.. కడియం పైన స్పీకర్ నిర్ణయం ఏంటనేది ఆసక్తి గా మారుతోంది.












Click it and Unblock the Notifications