జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్

తెలంగాణలో నిరుద్యోగ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు ఆ హామీలను పూర్తిగా విస్మరించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు నమ్మరని తెలిసి రాహుల్ గాంధీతో కూడా హామీ ఇప్పించి యువతను మోసం చేశారని ఆరోపించారు.

లక్షల కుటుంబాల ఆశలు నెరవేరలేదు..

రాష్ట్రంలో 30 నుంచి 40 లక్షల కుటుంబాల్లో యువత పోటీ పరీక్షలకు సిద్ధమవుతుండగా, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కవిత అన్నారు. "నేను కష్టపడి పైకి వచ్చాను" అని సీఎం చెప్పుకుంటున్నా, నిజానికి నిరుద్యోగుల ఆశల మీద నడిచి అధికారంలోకి వచ్చారని విమర్శించారు.

telangana-jagruti-president-kalvakuntla-kavitha-shocking-comments-on-congress-government

సంక్షేమ పథకాల పతనం..

ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని కవిత మండిపడ్డారు. బాలింతలకు ఇచ్చే సాయం, కిట్లు ఆపేసారని, అంగన్‌వాడీ కార్మికులకు జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఇవ్వాల్సిన వేల కోట్లు విడుదల చేయకపోవడం విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతోందని అన్నారు.

విద్యార్థుల అవసరాలకు నిధులు లేకపోతే, మూసీ నది అభివృద్ధికి వేల కోట్లు కేటాయించడం ప్రభుత్వ ప్రాధాన్యతలపై సందేహాలు కలిగిస్తోందని కవిత విమర్శించారు. ఉద్యోగ నియామకాల ప్రక్రియను పలు జీవోలు అడ్డుకుంటున్నాయని కవిత ఆరోపించారు. డిగ్రీ లెక్చరర్ల నుంచి పోలీస్ ఉద్యోగాల వరకు ప్రతి నోటిఫికేషన్‌కు ఒక జీవో అడ్డంకిగా మారిందని, ముఖ్యంగా జీవో నంబర్ 4 మహిళల రిజర్వేషన్లకూ ఆటంకం కలిగిస్తోందని పేర్కొన్నారు.

నియామకాల్లో అవకతవకల ఆరోపణలు..

డిగ్రీ లెక్చరర్ల నియామకాల్లో ఇంటర్వ్యూలకు అధిక మార్కులు కేటాయించడం, పీహెచ్‌డీకి వెయిటేజీ ఇవ్వడం వంటి అంశాలు అనుమానాలకు తావిస్తున్నాయని కవిత అన్నారు. ఇవన్నీ తమ వారికి అనుకూలంగా వ్యవహరించే ప్రయత్నాలేనని ఆరోపించారు.

అలానే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను మూడు సంవత్సరాలుగా నిర్వహించకపోవడం, నర్సింగ్ పరీక్ష ఫలితాలు విడుదల చేయకపోవడం యువతను తీవ్ర నిరాశకు గురిచేస్తోందని కవిత అన్నారు. మరోవైపు రేషన్ కార్డుల విషయంలో కూడా ప్రభుత్వం అన్యాయం చేస్తోందని కవిత మండిపడ్డారు. ఐటీ రిటర్న్స్ లేదా చిన్న ఉద్యోగాల పేరుతో లక్షలాది కార్డులను రద్దు చేయడం పేదలపై దాడి చేయడమేనని విమర్శించారు.

ప్రభుత్వానికి హెచ్చరిక..

ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌కు అడ్డుగా ఉన్న జీవోలను వెంటనే రద్దు చేయాలని కవిత డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులతో కలిసి భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. నోటిఫికేషన్లు విడుదల చేసే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+