మరో పథకం అమలుకు సిద్దం- ఖాతాల్లో రూ లక్ష, అర్హతలు..!!
తెలంగాణలో మరో పథకం అమలు దిశగా కసరత్తు జరుగుతోంది. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే కొన్ని అమలు చేసింది. ఇతర హామీల అమలు పైన ప్రభుత్వం వివరాలు సేకరిస్తోంది. అందులో భాగంగా ఆడపిల్లకు కల్యాణ లక్ష్మి స్కీమ్ లో భాగంగా లక్ష రూపాయలతో పాటు 10 గ్రాముల బంగారం కానుకగా ఇస్తామని చెప్పిన హామీ పైన దరఖాస్తులు స్వీకరించారు. అర్హులను గుర్తించి వారి ఖాతాల్లో రూ లక్ష జమ చేసేందుకు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన అర్హతల పైన దాదాపు స్పష్టత వచ్చింది.
2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మీ పథకం కింద అర్హులకు రూ లక్ష వరకు అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటుగా పది గ్రాముల బంగారం ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఇప్పుటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, రూ.500లకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అమలు చేస్తున్నారు. మూడు విడతల్లో రెండు లక్షల వరకు రుణమాపీ అమలు చేసారు. దీంతో, ఇతర పథకాల పైన ఇప్పుడు ఫోకస్ చేసారు.అందులో భాగంగా కల్యాణలక్ష్మీ పథకం కోసం అర్హుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను సేకరించింది. బడ్జెట్ లోనూ ప్రభుత్వం ఈ పథకం కోసం రూ 2,175 కోట్లు ప్రతిపాదన చేసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం కల్యాణ లక్ష్మి పథకం కోసం 65,026 మంది దరఖాస్తు చేసుకున్నారు. మరో 31,468 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి.

అర్హతలు
అర్హతను పరిశీలించి తిరస్కరణకు గురైనవి కాకుండా..24,038 దరఖాస్తులకు నిధులు మంజూరు చేయాలని నిర్ణయించారు. నిధుల జమ వీటితో పాటుగా అర్హత పొంది నిధులు లేక పెండింగ్ లో ఉన్న లబ్దిదారులకు నిధులను మంజూరు చేయనున్నారు. నిధుల సమీకరణ పైన కసరత్తు చేస్తున్న ప్రభుత్వం త్వరలోనే ఈ పథకం కింద లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రభుత్వం నుంచి పెద్ద సంఖ్యలో మహిళలకు ఎదురు చూస్తున్న పథకం నెలకు రూ 2,500 నగదు.
ప్రభుత్వం ఈ పథకం పైన ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, వచ్చే ఆర్దిక సంవత్సరం (ఏప్రిల్ 1) నుంచి ఈ పథకం అమలు చేస్తారనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. మాఘమాసం ఫిబ్రవరి నెల నుంచి మొదలవు తుండటంతో అప్పటి నుంచి పెళ్లిళ్లు చేసుకున్న వారికి మాత్రమే ఈ పథకం వర్తించేలా నిబంధన లను రూపొందిస్తున్నారు. గతంలో పెళ్లిళ్లు చేసుకున్న వారికి ఈ పథకం వర్తించకపోవచ్చని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి అధికారికంగా త్వరలోనే ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications