కామారెడ్డి కకావికలం.. వరద ధాటికి ఎన్ హెచ్ 44 బంద్, అటు వెళ్లొద్దు!
రాష్ట్రంలో కామారెడ్డి వరద ధాటికి కకావికలంగా మారింది. కామారెడ్డి జిల్లాలోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ మునిగి, ఫస్ట్ ఫ్లోర్ వరకు వరదనీరు చేరుకోవడంతో అనేక కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలు తమను కాపాడాలంటూ వేడుకుంటున్నారు. కామారెడ్డి దగ్గరలోని జాతీయ రహదారి ఎన్ హెచ్ 44 పైకి వరద నీరు వచ్చి చేరడంతో రోడ్డు డ్యామేజ్ అయింది. దీంతో ఈ రహదారిలో వాహన రాకపోకలను దారి మళ్లిస్తున్నారు.
జాతీయ రహదారి NH-44 డ్యామేజ్.. వాహన రాకపోకలు బంద్
భారీ వర్షాల కారణంగా కామారెడ్డి దగ్గరలోని జాతీయ రహదారి NH-44 డ్యామేజ్ కావడంతో 25% రాకపోకలు మాత్రమే జరుగుతున్నాయని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి మేడ్చల్- రామాయంపేట- కామారెడ్డి-డిచ్పల్లి దారిలో కాకుండా వేరే ప్రత్యామ్నాయ మార్గాల గుండా వెళ్లాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా ఎన్ హెచ్ 44 పై హెవీ వెహికిల్స్ అన్ని మేడ్చల్ నుంచి డైవర్ట్ చేయడం జరిగిందన్నారు.

వాహనాలను దారి మళ్లిస్తున్న పోలీసులు
చిన్న వెహికల్ అన్నీ కూడా రామాయంపేట నుంచి డైవర్ట్ చేయడం జరిగిందని ఈ విషయాన్ని ప్రయాణికులు అందరూ గమనించాలని పేర్కొన్నారు. అంతేకాదు కుండపోతగా కురుస్తున్న వర్షాలతో కామారెడ్డి జిల్లా మొత్తం వరద ముంపులో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయిన సుమారు 500కు పైగా మందిని రెస్క్యూ చేశామని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.
#WATCH | Kamareddy, Telangana: Portion of a road washed away following heavy rainfall in the area pic.twitter.com/lqcehIvpG9
— ANI (@ANI) August 28, 2025
కామారెడ్డి మీదుగా హైదరాబాద్ వెళ్లొద్దు: నిర్మల్ ఎస్పీ సూచన
ఇంకా వర్షాలు తగ్గని నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా బయటకు రావొద్దని సూచించారు. అత్యవసరం ఉంటే డయల్ 100 లేదా డిస్టిక్ హెల్ప్ లైన్ నెంబర్ 08468-220069 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ఇక మరోవైపు భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జల మయం అవ్వడంతో ఆదిలాబాద్ నుండి వయా కామారెడ్డి మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు నిర్మల్ జిల్లా ఎస్పీ సూచనలు చేశారు.
నిర్మల్ నుండి వాహనాల డైవర్షన్
నిర్మల్ వద్ద ఉన్న కొండాపూర్ బ్రిడ్జి నుండి ఎడమ వైపు కి తిరిగి డైవర్షన్ మార్చుకొని కొండాపూర్ నుండి వయా మామడ,ఖానాపూర్ మెట్ పల్లి,జగిత్యాల్, కరీంనగర్ మీదుగా హైదరాబాద్ వెళ్లాలని కామారెడ్డి మార్గంలో వెళ్లకూడదని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలియ జేశారు.












Click it and Unblock the Notifications