కేటీఆర్... నీకు, నీ అయ్యకు చచ్చేరోజు కూడా గుర్తుంటా!
కామారెడ్డి నుంచి విజయం సాధించిన వెంకటరమణారెడ్డి మీడియాతో మాట్లాడారు. వందకు వంద శాతం తన పేరు వెంకటరమణారెడ్డి అని కేటీఆర్ కు తెలుసన్నారు. పేరు పలకడానికి, ఉచ్ఛ రించడానికి కూడా సంస్కారం రాలేదా? అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు జరిగిన ఒక ప్రెస్ మీట్ లో కేటీఆర్ మాట్లాడుతూ కామారెడ్డితో నిలుచున్నవారెవరు? ఆయన పేరేంటి? అని పక్కనున్నవారిని అడిగారన్నారు.
ప్రతిపక్ష పార్టీలతో, సహచర రాజకీయ నేతలతో ఎలా మాట్లాడాలి? మర్యాదకు ఉన్న విలువేంటి? ఆత్మాభిమానానికి ఉన్న విలువేంటి? అన్న విషయం నీకు, నీ అయ్యకు తెలియకపోయినా తనకు తెలుసన్నారు. హేళనగా పక్కనున్నవారిని ఆయనెవరు? అని అడిగారని, అందుకు కేటీఆర్ పక్కనున్నవారు పిచ్చివాళ్లని, తన పక్కన మంచివారున్నారన్నారు. నీ తల దిమ్మదిరిగిపోయేలా, తనపేరును జీవితాంతం గుర్తుకు ఉంచుకునేలా చేస్తానన్నారు. నీకు, నీ నాయనకు యావజ్జీవితం తాను గుర్తుంటానన్నారు. చచ్చేరోజు కూడా తననే గుర్తుంచుకొని చావాలని, ఆ పరిస్థితిని తీసుకొస్తానని, తనమీద తనకు, కామారెడ్డి ప్రజల మీద తనకు నమ్మకం ఉందన్నారు.

కామారెడ్డి నుంచి పోటీచేసిన భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద భారతీయ జనతాపార్టీ నుంచి పోటీచేసిన వెంకటరమణారెడ్డి ఘనవిజయం సాధించారు. ఇక్కడి ఓటర్లు విలక్షణమైన తీర్పునిచ్చారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి స్థానికులు కాకపోవడంతో ఓటర్లంతా వెంకటరమణారెడ్డివైపు మొగ్గుచూపినట్లు స్పష్టమవుతోంది.
KCR, KTR కి నా పేరు గుర్తుండిపోయేలా చేస్తా అని చెప్పి మరి చేసి చూపించిన వెంకటరమణ రెడ్డి..! #KatipalliVenkataRamanaReddy #KCR #KTR #RevanthReddy #TelanganaAssemblyElectionResults2023 #ElectionResults #ElectionResults2023 #AssemblyElections2023 #Oneindiatelugu pic.twitter.com/CvS7sukyYx
— oneindiatelugu (@oneindiatelugu) December 4, 2023












Click it and Unblock the Notifications