ఫొటోలు తీస్తూ కర్ణాటకలో కరీంనగర్ మెడికో మృతి

హైదరాబాద్: కర్ణాటకలోని దండేలి వద్ద కరీంనగర్ జిల్లాకు చెందిన వైద్య విద్యార్థి భరత్‌చంద్ర(26) మృతి చెందాడు. జలపాతం వద్ద ఫోటోలు తీసుకుంటుండగా భరత్ చంద్ర ప్రాణాలు కోల్పోయాడు.

రాయ్‌చూర్ వైద్య కళాశాలలో భరత్ పీజీ డిప్లొమా చదువుతున్నాడు. భరత్ చంద్ర స్వస్థలం కరీంనగర్ జిల్లా మంథని. మృతుడి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Karimnagar medico dead in Karnataka

అంతర్రాష్ట్ర దొంగల ముఠా పట్టివేత

మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల్‌ పట్టణంలో అంతఃరాష్ట్ర దొంగల ముఠా పట్టబడింది. శనివారం జరిగిన ఈ సంఘటనలో నలుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.

వారి నుంచి రూ.1.30 లక్షలు, 4 ద్విచక్రవాహనాలు స్వాధీనపరుచుకున్నారు. నిందితులు ఏ రాష్ర్టానికి చెందినవారో తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

మావోయిస్టు లొంగుబాటు

పోలీసులు ఐదేళ్లుగా గాలిస్తున్న మావోయిస్టు ఏరియా కార్యదర్శి ధర్మయ్య అలియాస్‌ ధర్మన్న ఖమ్మం జిల్లా భద్రాచలం ఏఎస్పీ భాస్కరన్‌ ఎదుట లొంగిపోయాడు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ధర్మన్న కోసం 2010 నుంచి పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధర్మన్న శనివారం ఉదయం పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+