తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే-మేం డబ్బుపంపుతుంటే నిద్రపోతున్నారా ? డీకే శివకుమార్ కామెంట్స్

తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యమని, తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారం కోసం వెళ్తూ గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చిన శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతల విమర్శల దగ్గరి నుంచి తెలంగాణ ప్రజల ఆలోచనల వరకూ పలు అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ అంతా మార్పు కోసం ఎదురుచూస్తోందని కర్నాటక డిప్యూటీ సీఎం శివకుమార్ తెలిపారు. వారంతా కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ రుణం తీర్పుకునేందుకు ఎదురుచూస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈసారి అధికారం ఇవ్వాలని జనం ఆలోచిస్తున్నారన్నారు. బీఆర్ఎస్, కేసీఆర్ కు విశ్రాంతి తీసుకునే సమయం వచ్చిందని, వారికి శాశ్వత విశ్రాంతి ఇవ్వాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారన్నారు.

karnataka deputy cm dk shiva kumar confident of congress winning telangana polls-what he says?

మరోవైపు ఫాక్స్ కాన్ సంస్ధను కర్నాటకకు తరలించేలా లేఖ రాశామంటూ జరుగుతన్న ప్రచారాన్ని శివకుమార్ ఖండించారు.బెంగళూరువైపు ప్రపంచమంతా చూస్తోందన్నారు. బెంగళూరులో వాతావరణం, ఇతర అనుకూల పరిస్ధితులను చూసి సంస్ధలు తరలివస్తున్నాయని తెలిపారు. తాము ఇతర రాష్ట్రాల్లో సంస్ధల్ని మా రాష్ట్రానికి తరలించడం లేదన్నారు. వేరే రాష్ట్రాల్లోకి వచ్చే సంస్ధల్నితమ రాష్ట్రానికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదన్నారు.

అటు తెలంగాణ ఎన్నికలకు కర్నాటక నుంచి డబ్బు పంపుతున్నారన్న బీఆర్ఎస్ ఆరోపణలపై స్పందిస్తూ ఆ పార్టీ నేతలు నిద్రపోవడం లేదనే అనుకుంటున్నట్లు డీకే శివకుమార్ తెలిపారు. తమకు ఎలాంటి అవసరం లేదన్నారు. కర్నాటకలో ఇచ్చిన అన్ని గ్యారంటీల్ని అమలు చేస్తున్నామని, వచ్చే నెల 9న తెలంగాణలో గెలిచాక ఇక్కడా అన్ని గ్యారంటీల్ని అమలు చేస్తామని డీకే శివకుమార్ హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+