Kavitha Counter to KTR: క్లీన్ చిట్ పై కేటీఆర్ ట్వీట్ కు కవిత ఘాటు కౌంటర్..!
ఢిల్లీ మద్యం స్కాం కేసులో ఇవాళ ఢిల్లీ కోర్టు తనకు క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత (Kavitha)ను ఉద్దేశించి తన సోదరుడు కేటీఆర్ (ktr) చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. ఈ ట్వీట్ లో కవితకు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని స్వాగతిస్తూనే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో కవిత వీటిపై వెంటనే స్పందించారు. తన సోదరుడు చేసిన ట్వీట్ పై తీవ్ర విమర్శలతో కౌంటర్ ఇచ్చారు. దీంతో కవిత స్పందన కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.
కేటీఆర్ తన ట్వీట్ లో ఓ పక్క కంగ్రాట్స్ చెప్తూనే, మరోవైపు తమ ప్రభుత్వం పడిపోవడానికి ఢిల్లీ మద్యం కేసే కారణమని చెప్పడాన్ని కవిత తప్పుబట్టారు. ఇవాళ పొద్దున్నుండి బీఆర్ఎస్ సోషల్ మీడియాలోనూ ఇదే ట్విస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. తనపై కేసు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ కోసమేనన్న విషయం కేటీఆర్ అర్దం చేసుకోవాలన్నారు. తాను జైలుకు వెళ్లేంత వరకూ కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టకపోవడం ఎందుకని కవిత ప్రశ్నించారు.

తనపై కేసు నమోదైతే పార్టీ నుంచి ఎలాంటి సహకారం లభించలేదన్నారు. బతుకమ్మకు తాను బ్రాండ్ అంబాసిడర్ గా మారితే వాటి స్ధానంలో లిక్కర్ బాటిల్స్ పెట్టిన సమయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎక్కడుందన్నారు. ఆనాడే మీరు వీటిని ఎదుర్కొని ఉంటే పార్టీకి ఈ గతి పట్టేది కాదన్నారు. అప్పట్లో ఇళ్లు, ఉద్యోగాలు ఇవ్వలేదన్న అంశాలతో పాటు దోపిడీ దారులకు టికెట్లు ఇవ్వొద్దని తాను చెప్పినా వినలేదన్నారు. కానీ ఇప్పుడు ఢిల్లీ కోర్టు తీర్పును అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ ఓటమిని తన మెడలో వేయాలని కేటీఆర్ చూస్తున్నారన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు వాస్తవాలు అర్ధం చేసుకోవాలన్నారు. తన మెడలో పార్టీ ఓటమిని వేయాలని చూస్తే ప్రజలు కూడా హర్షించరన్నారు. రెండు నెలల్లో తాను కొత్త పార్టీ పెట్టబోతున్నానని, అలాంటి సమయంలో ఈ తీర్పు రావడం దేవుడి ఆశీర్వాదం అన్నారు.












Click it and Unblock the Notifications