సీఎంల ముచ్చట్లు: చేతులు కట్టుకొని కేసీఆర్, నవ్వుతూ చంద్రబాబు
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, నారా చంద్రబాబు నాయుడులు మంగళవారం నాడు మరోసారి కలిశారు.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, నారా చంద్రబాబు నాయుడులు మంగళవారం నాడు మరోసారి కలిశారు. కలివిడిగా చాలాసేపు మాట్లాడుకున్నారు. స్వెట్టర్ ధరించి చలికి చేతులు కట్టుకొని చంద్రబాబుతో మాట్లాడారు. ఇరువురు నవ్వుతూ మాట్లాడుకున్నారు.
చంద్రబాబు, కేసీఆర్ చాలాసేపు మాట్లాడుకున్నారు. వారితో కేంద్రమంత్రి, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ కూడా జతకలిశారు. తెలంగాణ ప్రతిపక్ష నేత జానా రెడ్డి కూడా కాసేపు చంద్రబాబు, కేసీఆర్‌తో మాట్లాడారు. వారు మాట్లాడుతుండగా కొందరు నేతలు వచ్చి విష్ చేసి వెళ్లారు.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నాలుగు రోజుల క్రితం శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చారు. ఆయన గౌరవార్థం గవర్నర్ నరసింహన్ విందు ఇచ్చారు. ఈ విందుకు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు హాజరయ్యారు.

హాజరైన వారిలో...
ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్, ఇర రాష్ట్రాల స్పీకర్లు మధుసూదనా చారి, కోడెల శివప్రసాద రావు, ఉప ముఖ్యమంత్రులు చినరాజప్ప, కడియం శ్రీహరి, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఏపీ ప్రతిపక్ష నేత జానారెడ్డి, బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, డాక్టర్ కే లక్ష్మణ్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కవిత, మండలి చైర్మన్ స్వామిగౌడ్, తమిళనాడు మజీ గవర్నర్ రోశయ్య, విద్యావేత్త చుక్కా రామయ్య, క్రీడా ప్రముఖులు సానియా మీర్జా, పీవీ సింధు, కోచ్ పుల్లెల గోపీచంద్ తదితరులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications