ఢిల్లీకి మాజీ సీఎం కేసీఆర్, ఇక నేరుగా - కీలక మలుపు..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీసీ రిజర్వేషన్ల అంశం పైన ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ కొత్త కార్యాచరణ సిద్దం చేసింది. ఇదే సమయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ కొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. కరీంనగర్ లో బహిరంగ సభకు నిర్ణయించింది. కాగా, పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ కీలక భేటీ నిర్వహించారు. అనేక అంశాల పైన చర్చించారు. త్వరలో కేసీఆర్ ఢిల్లీకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. తిరిగి రాజకీయంగా కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు కీలక మలుపుగా మారుతున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి రాజకీయంగా కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. కాళేశ్వరం నివేదిక ప్రభుత్వానికి అందటంతో ఈ విచారణకు హాజరైన దీని పైన పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. అదే విధంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత కేసులో సుప్రీం కోర్టు మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని తీర్పు వెలువరించింది. ఈ అంశం పైన న్యాయ నిపుణుల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఇక.. బీసీ రిజర్వేషన్లు.. బనకచర్ల అంశం పైనా కేసీఆర్ ఫోకస్ చేసారు బనకచర్ల ప్రాజెక్టును నిలువరించేందుకు ఒకవైపు క్షేత్రస్థాయిలో ప్రజలను పోరాటాలకు సమాయత్తం చేస్తూనే, మరోవైపు సుప్రీంకోర్టులో న్యాయం పోరాటం చేసేందుకు కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తున్నారు.

బీసీ రిజర్వేషన్ల అంశం పైనా కేసీఆర్ కార్యాచరణ ఖరారు చేసారు. దీని కోసం పోరాటానికి సిద్దం అని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ మేరకు ఉద్యమ కార్యాచరణపై సమాలోచనలు జరిపారు. కరీంనగర్‌లో ఆగస్టు 8న బీసీ బహిరంగసభతో బీసీ ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుడుతున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ ఆగస్టు 5 నుంచి మూడు రోజుల పాటు బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ కేంద్రం గా కార్యక్రమాలు ఖరారు చేసింది. కాగా, కరీంనగర్ సభ తరువాత కేసీఆర్ ఢిల్లీ వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ బీసీ నాయకులతో కలిసి ఆయన ఈ పర్యటన చేపట్టనున్నారు. రాష్ట్రపతిని కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపుకు ఆవశ్యకతను వివరించాలని డిసైడ్ అయ్యారు. ఉమ్మడి జిల్లాల వారీగా బీసీ సభలకు నిర్ణయించారు. ఇప్పుడు కేసీఆర్ చాలా రోజుల తరువాత తిరిగి ప్రజల్లోకి వస్తుండటం.. రాజకీయంగా కీలక మలుపుగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications