స్టీరింగ్ మారింది - ఓమ్ని వ్యాన్ న‌డిపిన కేసీఆర్..!!

బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్‌ ఓమ్ని వ్యాన్ న‌డిపారు. కొన్ని నెల‌ల క్రితం కేసీఆర్ బాత్రూమ్‌లో జారి ప‌డ‌టంతో తుంటి ఎముక విరిగి ఆప‌రేష‌న్ అయిన విష‌యం తెలిసిందే. కాలు ఆపరేషన్ తరువాత కర్ర సహాయం లేకుండా నడుస్తున్న కేసీఆర్.. మ్యానువల్‌ కారు నడిపి చూడమని డాక్టర్ల సూచనల మేరకు తన ఫాం హౌజ్‌లో ఉన్న‌ పాత ఓమ్నీ వ్యాన్ న‌డిపారు. కేసీఆర్ డ్రైవింగ్ చేసిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

కేసీఆర్‌కు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స నిర్వ‌హించ‌గా, అది విజయవంతమైంది. శస్త్రచికిత్స తర్వాత కేసీఆర్‌ను వైద్యులు తొలిసారి నడిపించారు. వైద్యుల సూచనల మేరకు వాకర్‌ సాయంతో బీఆర్‌ఎస్‌ అధినేత మెల్లగా అడుగులు వేశారు. ఇక డిశ్చార్జి అయిన త‌ర్వాత కొద్ది రోజుల‌కు క‌ర్ర సాయంతో కేసీఆర్ న‌డిచారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌ప్పుడు కూడా క‌ర్ర సాయంతోనే కేసీఆర్ ప్ర‌చారంలో పాల్గొన్నారు. కాలు ఆపరేషన్ తరువాత కర్ర సహాయం లేకుండా కేసీఆర్ న‌డుస్తున్నారు. అయితే మ్యానువల్ కారు నడిపి చూడమని డాక్టర్లు సూచించ‌డంతో తన పాత ఓమ్నీ వ్యాన్‌ను కేసీఆర్ గురువారం న‌డిపారు.

KCR Drive Omni van with doctros advice in farm house goes viral

గ‌తేడాది డిసెంబ‌ర్ 8వ తేదీ అర్ధ‌రాత్రి కేసీఆర్ కాలు జారిప‌డ్డ సంగ‌తి తెలిసిందే. దీంతో కుటుంబ స‌భ్యులు కేసీఆర్‌ను సోమాజిగూడ‌లోని య‌శోదా ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స చేయించారు. కేసీఆర్ ఫాం హౌస్ లోనే తన పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా పలువురు పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ వీడి కాంగ్రెస్ లో చేరారు. పార్టీలో కొనసాగుతున్న వారితో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఆరు నెలల కాలంలో పరిస్థితులు మార్పు వస్తాయని చెప్పారు. తిరిగి పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఎమ్మెల్యేల్లో భరసా నింపే ప్రయత్నం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+