పెట్టుబడుల వెల్లువ: 19 కంపెనీలకు అనుమతి, 5,321 మందికి ఉపాధి(ఫోటోలు)

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానం టీఎస్‌ఐపాస్‌ను అమల్లోకి తెచ్చిన తర్వాత పరిశ్రమల స్థాపనకు దరఖాస్తు చేసుకున్న 19 కంపెనీల సీఎండీలు, సీఈవోలకు సీఎం కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వయంగా అనుమతి పత్రాలు అందజేశారు.

తొలి విడతలో 17 మందికి అనుమతి పత్రాలు అందజేయగా, రెండో విడతలో 19 పరిశ్రమల స్థాపనకు అనుమతి పత్రాలిచ్చారు. రెండవ విడతలో 19 కంపెనీలు 1087 కోట్ల పెట్టుబడితో పరిశ్రమల స్థాపనకు దరఖాస్తు చేసుకున్నాయి. కొత్తగా ఏర్పాటుచేయనున్న ఈ పరిశ్రమలతో రాష్ట్రానికి రూ.1087.37 కోట్ల పెట్టుబడులు రానున్నాయి.

వీటిద్వారా 5,321 మందికి ఉపాధి కల్పించనున్నారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఈ కంపెనీలను నెలకొల్పనున్నారు. రెండో విడతలో అనుమతి పత్రాలు అందుకున్న పరిశ్రమలలో ఫార్మాసూటికల్స్, హెలిక్యాప్టర్ల క్యాబిన్ తయారీ, స్టీల్ అండ్ ఐరన్, ఫుట్‌వేర్, సెల్ ఫోన్ తయారీ యూనిట్లు ఉన్నాయి.

 19 కంపెనీలకు అనుమతులు: స్వయంగా అందజేసిన కేసీఆర్

19 కంపెనీలకు అనుమతులు: స్వయంగా అందజేసిన కేసీఆర్

వీటిలో స్పానీష్‌కు చెందిన ప్రముఖ ఫార్మాసూటికల్ కంపెనీ (చీమో) కూడా ఉంది. ప్రభుత్వం తరఫున ఎలాంటి ఇబ్బంది తలెత్తినా, ఎలాంటి సహాయ, సహకారం అవసరమైనా తన కార్యాలయంలోని చేజింగ్ సెల్ ముఖ్య కార్యదర్శి శాంతికుమారిని సంప్రదించాల్సిందిగా సిఎం సూచించారు.

 19 కంపెనీలకు అనుమతులు: స్వయంగా అందజేసిన కేసీఆర్

19 కంపెనీలకు అనుమతులు: స్వయంగా అందజేసిన కేసీఆర్

తమ ప్రభుత్వానికి ఇండస్ట్రీయల్ అంబాసిడర్స్ ఉన్నారని వారి సేవలను వినియోగించుకోవచ్చని ముఖ్యమంత్రి సూచించారు. పరిశ్రమల స్థాపన, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే వారికి అన్ని అనుమతులను కేవలం 10 రోజులలో ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు.

 19 కంపెనీలకు అనుమతులు: స్వయంగా అందజేసిన కేసీఆర్

19 కంపెనీలకు అనుమతులు: స్వయంగా అందజేసిన కేసీఆర్


ఈ కార్యక్రమంలో పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్‌రావు, సీఎం అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ, చేజింగ్ సెల్ ఇన్‌చార్జి శాంతకుమారి, పరిశ్రమలశాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్, పరిశ్రమలశాఖ కమిషనర్ మాణిక్‌రాజ్, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డితోపాటు ఎస్‌ఆర్ బ్రహ్మాస్ అగ్రోప్రొడక్ట్స్ చైర్మన్ డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డిసహా పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

 19 కంపెనీలకు అనుమతులు: స్వయంగా అందజేసిన కేసీఆర్

19 కంపెనీలకు అనుమతులు: స్వయంగా అందజేసిన కేసీఆర్


టీఎస్‌ఐపాస్‌ను అమలులోకి తెచ్చిన తర్వాత తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారు. పారిశ్రామికవేత్తలకు అనుమతుల మంజూరులో ఎటువంటి జాప్యం జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం పకడ్బందీగా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి.

 19 కంపెనీలకు అనుమతులు: స్వయంగా అందజేసిన కేసీఆర్

19 కంపెనీలకు అనుమతులు: స్వయంగా అందజేసిన కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం టీఎస్‌ఐపాస్ ప్రకటించిన రోజు పేర్కొన్న ప్రకారం దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లో రికార్డు స్థాయిలో తొలిదశలో జూన్ 23న మొదటి దఫా కంపెనీలకు అనుమతిపత్రాలు మంజూరు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+