మామా అళ్లుల్లు అందుకే నియోజక వర్గాలు మార్చుకుంటున్నారా..?
హైదరాబాద్: వ్యూహాలకు ప్రతి వ్యూహాలు, ఎత్తులకు పై ఎత్తులు అంటే ఏంటో గజ్వేల్ రాజకీయాలు గమనిస్తే ఇట్టే అర్థం ఐపోతుంది. స్వయంగా ఆపథర్మ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఇలాకాలో రాజకీయాలు రంజుగా నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి నియోజక వర్గం అంటే కొంత ప్రత్యేకత సంతరించుకుంటుంది. ఏ నియోజక వర్గంలో ఎవరు గెలిచిఏనా, ఓడినా పెద్ద పట్టింపు ఉండదు గాని, స్వయంగా ముఖ్యమంత్రి ఓడిపోతే ఎంతో అవమానంగా భావిస్తుంటారు ప్రజలు.
అలాంటి పరిస్థితులే ఇప్పుడు గజ్వేల్ నియోజెక వర్గంలో నెలకొన్నాయి. గజ్వేల్ నియోజక వర్గం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఎంతో ప్రతిస్టాత్మకతను సంతరించరుకుంది. తాజాగా కేసీఆర్ ఆ నియోజకవర్గం నుండి వేరే నియోజక వర్గానికి మారేందుకు చేసుకుంటున్న సన్నాహాలు చూసి అందరూ ఆశ్యర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

విస్మయానికి గురి చేస్తున్న కేసీఆర్ నిర్ణయం..! గజ్వేల్ ను ఒదిలిపెట్టొద్దంటున్న శ్రేణులు..!!
గజ్వేల్ లో కాంగ్రెస్ ఇస్తున్న వరుస షాక్ లతో టెన్షన్ లో ఉన్న కేసీఆర్ తాజాగా మరో ఎత్తుగడ వేశారు. సీఎం స్థాయి వ్యక్తి ఎన్నికల్లో ఓడితే, ఎంత అవమానమో అందరికన్నా ఎక్కువగా చంద్రశేఖర్ రావుకే బాగా తెలుసు. అందుకే కొంతకాలంగా ఫాంహౌజ్ లో మంతనాలు జరిపిన కేసీఆర్, ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ను నిలువరించాలంటే బ్రుహత్కర ప్రణాళిక తప్పదని భావించారు. ప్రత్యర్ధులుగా ఉన్న వంటేరు ప్రతాప్ రెడ్డి, తూంకుంట నర్సారెడ్డిలు చేతులు కలపటంతో గజ్వేల్ లో కేసీఆర్ ఓటమి ఖాయం అయిపోయిందనే చర్చ తారా స్థాయిలో నడుస్తోంది.

కేసీఆ3ర్ పై స్థానికుల విమర్శలు..! ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదని ఆరోపణ..!!
కేసీఆర్ గజ్వేల్ లో గెలిచిన నాటి నుండి, ఇంతవరకు నియోజకవర్గ సమస్యలు, ఆయా గ్రామాల్లో మంచి చెడ్డా చూసుకున్న పరిస్థితి లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇతర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను నేరుగా కలిస్తే, చిన్న చిన్న పనులు నిమిషాల్లో అవుతున్నాయని, కానీ గజ్వేల్ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని స్థానికులు చెప్పుకొస్తున్నారు. దీంతో చాలా గ్రామాల్లో ప్రజలు చంద్రశేఖర్ రావు పట్ల అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ది దేవుడు ఎరుగు, తమ సమస్యలను పట్టించుకున్న నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒంటేరు ప్రతాప్ రెడ్డి గెలిస్తే, నర్సారెడ్డి-ప్రతాప్ రెడ్డిలు తమకు అండగా ఉంటారని జనం అభిప్రాయపడుతున్నారు.

బలపడ్డ వంటేరు..! అన్నీ తానై ప్రజలను మెప్పించిన ప్రతాప్ రెడ్డి..!!
దీంతో గజ్వేల్ లో గత 10రోజులుగా మకాం వేసి, ప్రచారం చేస్తున్న హరీష్ కు విషయం అర్థమయినట్టు తెలుస్తోంది.ఆపథర్మ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుతో తన గెలుపు కష్టమనే అంశాన్ని ప్రస్థావించినట్టు సమాచారం. దీంతో వ్యూహరచన చేసిన కేసీఆర్, తనకు మంచి ఆదరణ ఉన్న సిద్దిపేట నుండి ఎన్నికల బరిలో నిలబడేందుకు ప్రణాళిక రచించినట్టు తెలుస్తోంది. అందుకే తాను మళ్లీ సిద్ధిపేటకు మారుతున్నట్టు, అల్లుడు హరీష్ ను గజ్వేల్ బరిలో దిగేటట్టు పథకం రచించారు చంద్రశేఖర్ రావు. అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి మాత్రం కేసీఆర్ పై తాము నైతిక విజయాన్ని సాధించామని చెప్పుకుంటున్నారు. ప్రత్యర్థి సమర్థతను అర్థం చేసుకున్న కేసీఆర్ ముందుగానే ఓటమిని అంగీకరించారని అంటున్నారు.

రంగంలో కి హరీష్..! నష్ట నివారణ చర్యలపై నిఘా..!!
ఇదిలా ఉంటే సిద్ధిపేటను వీడవలేక, గజ్వేల్ కు వెళ్లలేక హరీష్ మదనపడుతున్నారని స్థానిక నాయకులంటున్నారు. కానీ చేసేదేమీ లేకపోవటంతో, గజ్వేల్ బరిలో నిలిచేందుకు హరీష్ మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవల హైదరాబాద్ కు కీలకమైన స్థానిక నేతలను పిలిపించుకొని, మంతనాలు చేసిన హరీష్, తాను గజ్వేల్ నుండి బరిలో ఉంటానని చెప్పినట్లు తెలుస్తోంది. మంచి రాజకీయ వ్యూహరచన చేసే వ్యక్తిగా పేరున్న ట్రబుల్ షూటర్ హరీష్ రావు, రంగంలోకి దిగటంతో, గజ్వేల్ రాజకీయం రంజుగా మారుతోంద చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. మరి మామ అళ్లుల్ల నియోజక వర్గ మార్పును జనం ఆదరిస్తారో చూడాలి.
-
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..! -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
నరసాపురం To అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే వేళ ఊహించని ట్విస్ట్..!! -
షాకిచ్చిన నటాషా.. హార్దిక్ లైఫ్లో ఊహించని ట్విస్ట్! -
గంటన్నారలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
36 రోజులపాటు ఇంటర్నెట్ బంద్.. సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications