Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహారాష్ట్రలో బీఆర్ఎస్ గాలి..: ఏం చేశాయంటూ కాంగ్రెస్, బీజేపీలపై కేసీఆర్ ఫైర్

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా.. ప్రజలకు సురక్షితమైన తాగునీరు, రైతులకు సాగునీరు ఎందుకు అందించలేకపోతున్నామని బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.

హైదరాబాద్: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా.. ప్రజలకు సురక్షితమైన తాగునీరు, రైతులకు సాగునీరు ఎందుకు అందించలేకపోతున్నామని బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రం నాందేడ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. నాందేడ్‌కు చెందిన పలువురు రాజకీయ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ అవతల తొలిసారి బీఆర్ఎస్ మీటింగ్ జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

అందుకే టీఆర్ఎస్.. బీఆర్ఎస్‌గా మారిందన్న కేసీఆర్

అందుకే టీఆర్ఎస్.. బీఆర్ఎస్‌గా మారిందన్న కేసీఆర్

బీఆర్ఎస్ నాందేడ్‌ స‌భా వేదికపై డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్, మ‌రాఠా యోధుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ పుష్పాంజ‌లి ఘ‌టించి, నివాళుల‌ర్పించారు. మహిళల విద్యాభ్యున్నతికి కృషి చేసిన అన్న బావుసాట్, అహల్యబాయి హోవల్కర్, మరఠ్వాడ పోరాట యోధులు చత్రపతి శివాజీ, రాణా ప్రతాప్, లోకమాన్య తిలక్, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్ర‌హాల‌కు కేసీఆర్ నివాళుల‌ర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. చ‌త్ర‌ప‌తి శివాజీ, అంబేద్క‌ర్, ఫూలే వంటి మ‌హానీయుల‌కు జ‌న్మ‌నిచ్చిన పుణ్య‌భూమి ఇది అని చెప్పారు కేసీఆర్.

కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. ఎన్నో ప్ర‌భుత్వాలు, ప్ర‌ధానులు మారారు కానీ.. ఈ దేశ ప్ర‌జ‌ల త‌ల‌రాత మాత్రం మార‌లేద‌న్నారు. దేశంలో మార్పు తెచ్చేందుకే బీఆర్ఎస్ ఏర్పాటు చేశామన్నారు. దేశ ప‌రిస్థితులు చూసిన త‌ర్వాత టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చామన్నారు కేసీఆర్.

దేశంలో మార్పు రావాలన్న కేసీఆర్

దేశంలో మార్పు రావాలన్న కేసీఆర్

'దేశంలో భారీ మార్పు రావాల్సిన అవ‌స‌రం ఉంది. క‌నీసం తాగునీరు, విద్యుత్ కూడా ఇవ్వ‌లేదు. మ‌హారాష్ట్ర‌లో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు అధికంగా ఉన్నాయి. రైతుల ఆత్మ‌హ‌త్య‌లు ఎందుకు జ‌రుగుతున్నాయో ఆలోచించండి. ఎన్ని క‌ష్టాలు, ఎన్ని క‌న్నీళ్లు, ఎంతో ఆవేద‌న ఉంటేనే రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు.

రైతులు ఎంతో క‌ష్ట‌ప‌డి పంట‌లు పండించినా చివ‌ర‌కు ఆత్మ‌హ‌త్య‌లు త‌ప్ప‌ట్లేదు. అందుకే అబ్‌కీ బార్.. కిసాన్ స‌ర్కార్.. నినాదంతో బీఆర్ఎస్ వ‌చ్చింది. దేశ దుస్థితిని చూసిన త‌ర్వాత ఈ స్థితిని మార్చాల‌ని సంక‌ల్పించాం. మా సంక‌ల్పానికి దేశ వ్యాప్తంగా భారీ మ‌ద్ద‌తు ల‌భిస్తోంది అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

ఏం చేశారంటూ కాంగ్రెస్, బీజేపీలపై కేసీఆర్ నిప్పులు

ఏం చేశారంటూ కాంగ్రెస్, బీజేపీలపై కేసీఆర్ నిప్పులు

భార‌త్ పేద దేశం ఎంత‌మాత్ర‌మూ కాదు.. భార‌త్ అమెరికా కంటే ధ‌న‌వంత‌మైన దేశమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. భార‌త్‌లో స‌మృద్ధిగా వ‌న‌రులు ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌లు వంచ‌న‌కు గుర‌వుతున్నారు. భార‌త్‌లో ఉన్నంత సాగుయోగ్య‌మైన భూమి ఇంకెక్కడా లేదు. భార‌త్ బుద్ధి జీవుల దేశం. నాగ‌లి ప‌ట్టే చేతులు.. శాస‌నాలు చేయాల్సిన రోజులు వ‌చ్చాయి. ఎన్నిక‌ల్లో గెల‌వాల్సింది నాయ‌కులు కాదు.. ప్ర‌జ‌లు, రైతులు గెల‌వాలి.

ఆ స‌మ‌యం ఎన్నాళ్లో ఎదురు చూశాం.. ఇక ఇప్పుడు ఆ స‌మ‌యం వ‌చ్చింది. మ‌హారాష్ట్ర‌లో ఇన్ని న‌దులున్నా.. నీటి క‌రువు ఎందుకు వ‌చ్చింది. 54 ఏళ్లు కాంగ్రెస్.. 16 ఏళ్లు బీజేపీ పాలించాయి. ఇవి ఏం సాధించాయి? అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప‌ర‌స్ప‌రం ఆరోప‌ణ‌లు చేసుకోవ‌డం త‌ప్పా చేసిందేమీ లేదు. నువ్వు అంత తిన్నావంటే.. నువ్వు ఇంత తిన్నావ‌ని కాంగ్రెస్, బీజేపీ తిట్టుకుంటాయని కేసీఆర్ విమర్శించారు. ఒకరు అంబానీ అంటే మరొకరు అదానీ అంటారన్నారు.

తమది రాజకీయ పోరాటం కాదన్న కేసీఆర్

తమది రాజకీయ పోరాటం కాదన్న కేసీఆర్

మేకిన్ ఇండియాను మోడీ తీసుకొచ్చారని.. అది జోకిన్ ఇండియాగా మారిపోయాందన్నారు కేసీఆర్. ప్రతి వీధిలోనూ చైనా బజార్లే ఉన్నాయన్నారు. మంజాలు, పతంగులు, ప్రతిమలు, జాతీయ జెండాలు కూడా చైనా నుంచే వస్తున్నాయన్నారు. ప్రతి వీధిలో భారత్ బజార్లే ఉండాలన్నారు. మన్ కీ బాత్ ఏ బాత్ ఓ బాత్ ఎందుకని ప్రశ్నించారు.

తమది రాజకీయ పోరాటం కాదని.. జీవన్మరణ పోరాటమని వ్యాఖ్యానించారు కేసీఆర్. దేశంలో సాగునీరు కోసం పెద్ద పెద్ద రిజర్వాయర్లు నిర్మించాల్సి ఉందన్నారు. సముద్రంలో కలుస్తున్న వృథా నీటిని ఉపయోగించుకోవాలన్నారు.

మహారాష్ట్రలో గోదావరి, కృష్ణా సహా ఎన్నో నదులున్నాయన్నారు. అయినా, తాగు, సాగు నీరు ఎందుకు లభించడం లేదని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వస్తే లాతూర్, గడ్చిరోలి, అన్ని ప్రాంతాలకు నీళ్లు వచ్చేలా చేస్తామన్నారు.

తెలంగాణ అభివృద్ధి దేశంలో కావాలంటే బీఆర్ఎస్ రావాలన్న కేసీఆర్

తాను ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పిన కేసీఆర్.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రాకముందు అనేక సమస్యలుండేవని చెప్పారు. రైతుల మరణాలుండేవని, తాగు, సాగునీరు దొరికేది కాదన్నారు. కరెంటు కూడా ఉండకపోయేదన్నారు. వలసలు ఎక్కువగా ఉండేవన్నారు. అయితే, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కష్టపడి ఇలాంటి సమస్యలను లేకుండా చేశామన్నారు. రైతులకు ఉచిత కరెంటు, నీళ్లు అందిస్తున్నామన్నారు. తెలంగాణలో 24 గంటలు కరెంటు ఉంటుందన్నారు.

రైతులను ఎవరూ మోటార్లు అడగరని అన్నారు. రైతు చనిపోతే రూ. 5 లక్షలు ఇస్తున్నామన్నారు. ఎకరాకు రూ. 10వేలు సాయం అందిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. ఇవన్నీ తెలంగాణలో సాధ్యమైనప్పుడు మహారాష్ట్రలో ఎందుకు కావని ప్రశ్నించారు. అందుకే బీఆర్ఎస్ కిసాన్ ప్రభుత్వం రావాలన్నారు కేసీఆర్.

మహారాష్ట్ర ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలన్న కేసీఆర్

నాందేడ్‌తో తెలంగాణకు రోటీబేటీకా సంబంధం ఉందన్నారు కేసీఆర్. అన్ని పార్టీలు ప్రజలను జాతి, ధర్మం, కుల, మత భేదాలు సృష్టిస్తున్నాయన్నారు. ఎలాగైనా గెలవాలని పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ సర్కారు వస్తే మహారాష్ట్రతోపాటు దేశం మొత్తం వెలుగిపోతోందన్నారు. మహారాష్ట్ర కంటే తెలంగాణ చిన్నదన్నారు. మహారాష్ట్రలో ఆదాయం ఎక్కువేనని తెలిపారు.

అయినా తాగునీరు, సాగునీరు, విద్యుత్ ఎందుకు లభించడం లేదన్నారు. దమ్మున్న ప్రభుత్వం రావాలన్నారు. ఢిల్లీలో ధర్నా చేసి వందలాది మంది రైతులు చనిపోతే.. ప్రధాని ఎందుకు స్పందించలదేని ప్రశ్నించారు కేసీఆర్. రైతులు ఆయనకు కనిపంచడం లేదా? అని అన్నారు. తాను ఏ వ్యక్తికి వ్యతిరేకం కాదన్నారు. రైతు మద్దతు కోసం వచ్చానన్నారు. రైతు ఆత్మహత్యలు ఉండవద్దని.. కరెంటు, తాగు, సాగునీరు లభించాలన్నారు. యూపీ, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో రైతులు ఎందుకు ధర్నాలు చేస్తున్నారని ప్రశ్నించారు. అందుకే కిసాన్ ప్రభుత్వం రావాలన్నారు. మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.

ప్రతి గ్రామంలో బీఆర్ఎస్.. మహారాష్ట్ర అంతటా పర్యటిస్తానన్న కేసీఆర్

తెలంగాణలో అన్ని వర్గాల అభివృద్ధి జరుగుతోందన్నారు కేసీఆర్. దళితులు, ఆదివాసీల అభివృద్ధి అన్ని రాష్ట్రాల్లోనూ జరగాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో దళితబంధు పథకం కింద ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తున్నామన్నారు. దేశంలో కూడా దళితబంధు అమలు కావాలంటే బీఆర్ఎస్ రావాలన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశంలో కూడా తెలంగాణలోని అన్ని పథకాలు అమలు చేస్తామన్నారు కేసీఆర్. మహారాష్ట్రలోని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ గాలి వీస్తుందన్నారు. శివాజీ జన్మస్థలంలో రైతు కమిటీలు వేస్తామన్నారు. తాను మహారాష్ట్రలోని అన్ని ప్రాంతాల్లోనూ పర్యటిస్తానని కేసీఆర్ చెప్పారు. జై మహారాష్ట్ర, జై భారత్ జై హింద్ అంటూ కేసీఆర్ తన ప్రసగంగాన్ని ముగించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+