వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాందేడ్ సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బాల్క సుమన్: కేసీఆర్ ఏం చెప్పారంటే.?

బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ గురించిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. సభా వేదికపై మాట్లాడుతున్న కేసీఆర్.. ఒక్కసారిగా బాల్క సుమన్ పేరు చెప్పి అతడ్ని తన వద్దకు పిలిచారు. దీంతో బాల్క సుమన్ కేసీఆర్ వద్దకు వచ్చారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో ఆ బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. మహారాష్ట్రతోపాటు దేశంలోనూ బీఆర్ఎస్ సర్కారు రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశం మొత్తం రావాలంటే.. బీఆర్ఎస్ పార్టీని గెలుపించుకోవాలన్నారు.

ఈ బహిరంగ సభలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ గురించిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. సభా వేదికపై మాట్లాడుతున్న కేసీఆర్.. ఒక్కసారిగా బాల్క సుమన్ పేరు చెప్పి అతడ్ని తన వద్దకు పిలిచారు. దీంతో బాల్క సుమన్ కేసీఆర్ వద్దకు వచ్చారు.

KCR introduces MLA Balka Suman in Nanded public meeting

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ యువకుడు తనతోపాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడని చెప్పారు. తమ పార్టీ నుంచి తొలిసారి ఏకంగా ఎంపీగా ఎన్నియ్యారని చెప్పారు. ఇతడు చాలా చిన్నవ్యక్తి అని.. ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడని తెలిపారు. బాల్క సుమన్ పోరాటం చేశాడు సాధించాడని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

మీరు కూడా ఇలా సాధించాలని ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. కాగా, ఈ సభలో పలువురు మహారాష్ట్ర రాజకీయ నాయకులు, సర్పంచులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కేసీఆర్ తోపాటు కవిత పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

బహిరంగ సభకు వచ్చేముందు ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాందేడ్ చారిత్రక గురుద్వారాను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌కు సిక్కు మ‌త‌ గురువులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం గురుద్వారాలో కేసీఆర్ ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేశారు. ప్రార్థ‌న‌ల అనంత‌రం కేసీఆర్‌ను సిక్కు మ‌త గురువులు ఆశీర్వ‌దించారు. సీఎం కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ క‌విత‌తో పాటు ప‌లువురు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు.

English summary
KCR introduces MLA Balka Suman in Nanded public meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X