బీఫారాల పంట, ఎకరాకు కోటి: కేసీఆర్ కు రేవంత్‌రెడ్డి

మెదక్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన వ్యవసాయ క్షేత్రంలో బీ ఫారాల పంట సాగు చేస్తున్నారని, ఎకరాకు రూ.కోటి దిగుబటి సాధిస్తున్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శనివారం ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం గజ్వెల్ నియోజకవర్గం జగదేవ్‌పూర్‌లో నిర్వహించిన సభలో మాట్లాడారు.

గత ఎన్నికల్లో బీఫారాలు అమ్ముకొని కోట్ల రూపాయలు కూడబెట్టి పంటల దిగుబడితో ఎకరాకు రూ.కోటి వస్తున్నాయని కేసీఆర్ తప్పుడు లెక్కరలు చెప్పడం హాస్యాస్పదమన్నారు.

బీజేపీకే మద్దతు

KCR is cultivating B Forms crop: Revanth Reddy

మెదక్‌ పార్లమెంట్‌ ఉప ఎన్నికలో మా మద్దతు బీజేపీకి ఉంటుందని మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రకటించారు. మెదక్‌ జిల్లా రామాయంపేటలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏబీసీడీ వర్గీకరణకు బీజేపీ రెండు దశాబ్దాలుగా మద్దతుగా నిలిచినందునే తమ పార్టీ ఈ కీలక నిర్ణయం తీసుకుందన్నారు. కేసీఆర్ ఎమ్మార్పీఎస్‌లో చీలిక తెచ్చే కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. ఒక సీఎంగా ఆయనకు ఇది తగదన్నారు.

గ్రామాల్లోకి టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఓట్లు అడిగేందుకు వస్తే గో బ్యాక్‌ అంటూ నిరసన తెలుపాలంటూ మహాజన సోషలిసు పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. దళితుడిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిన కేసీఆర్‌ దళితులకు ద్రోహి అన్నారు. ఎస్సీ వర్గీకరణపై కేసీఆర్‌ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ను కలువడానికి అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+