Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రండి, మూడేళ్లలో..: మళ్లీ కేసీఆర్ హామీ (పిక్చర్స్)

ఖమ్మం: మూడేళ్లలో మనం మిగులు విద్యుత్ సాధిస్తామని, 24వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి తెస్తామని, ఇందుకోసం 91వేల కోట్లకు పైగా కేటాయిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం అన్నారు.

మణుగూరులో ఆయన భద్రాద్రి విద్యుత్ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. దీనిని ఏడువేల రెండు వందల కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణలో పరిశ్రమలకు ఇప్పుడు కోతలు లేవన్నారు. మనం విద్యుత్ కష్టాలు అధిగమించామని, రాబోయే రోజుల్లో కోతలు ఉండవన్నారు.

భద్రాద్రిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఖమ్మం జిల్లాలో కరువు ఉండటం దురదృష్టకరమన్నారు. భద్రాద్రి విద్యుత్ కేంద్రంతో కరెంట్ కష్టాలు చాలా తీరుతాయని చెప్పారు. 2017 నాటికి మిగులు విద్యుత్ ఉంటుందని, పారిశ్రామికవేత్తలు పెట్టుబడులతో రావాలన్నారు.

 భద్రాద్రి పవర్ ప్లాంట్

భద్రాద్రి పవర్ ప్లాంట్

ఖమ్మం జిల్లా మణుగూరులో నిర్మిస్తున్న భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ ప్లాంటుతో రాష్ట్ర దశ మారిపోతుందని, రాజధానికి ఈశాన్యప్రాంతంలో ఉన్న ఈ ప్రాజెక్టు తెలంగాణకు విద్యుత్‌ కష్టాలను తొలగిస్తుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

 భద్రాద్రి పవర్ ప్లాంట్

భద్రాద్రి పవర్ ప్లాంట్

శనివారం భద్రాచలంలో జరిగిన సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్న అనంతరం ఆయన మణుగూరు సమీపంలోని సీతారామపురం - చిక్కుడుగుంట ప్రాంతంలో నిర్మిస్తున్న 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ప్లాంటుకు భూమిపూజ చేసి పైలాన్‌ను ఆవిష్కరించారు.

 భద్రాద్రి పవర్ ప్లాంట్

భద్రాద్రి పవర్ ప్లాంట్

కేసీఆర్‌కు జెన్కో అధికారులు మేళతాళాల మధ్య ఘనస్వాగతం పలికింది. భోజన విరామం తర్వాత ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్‌ కొరతకు మణుగూరు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ప్రారంభం నాటి నుంచే చెక్‌ పడుతుందన్నారు.

 భద్రాద్రి పవర్ ప్లాంట్

భద్రాద్రి పవర్ ప్లాంట్

విద్యుత్‌ ప్రాజెక్టులకు రూ.91,500 కోట్లు ఖర్చు చేయాలని ప్రణాళిక సిద్ధం చేసి ఆ మేరకు నిధుల కూర్పు కూడా చేశామన్నారు.

 భద్రాద్రి పవర్ ప్లాంట్

భద్రాద్రి పవర్ ప్లాంట్

బీహెచ్‌ఈఎల్‌ ఆధ్వర్యంలో రెండు విద్యుత్‌ ప్లాంట్లు ఈ ఏడాది అందుబాటులోకి రానున్నాయని, జైపూర్‌ థర్మల్‌ కేంద్రం ద్వారా 1200 మెగావాట్లు, భూపాలపల్లి విద్యుత్‌ కేంద్రం ద్వారా 600 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి రానుందని తెలిపారు.

 భద్రాద్రి పవర్ ప్లాంట్

భద్రాద్రి పవర్ ప్లాంట్

2017 మార్చి నాటికి రాష్ట్రంలో మిగులు విద్యుత్‌ ఉంటుందని ప్రకటించారు. 24 నెలల్లో భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నిర్మాణం పూర్తవుతుందని కేసీఆర్ వెల్లడించారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులతో సంతోషంగా రావాలని మణుగూరు వేదికగా పిలుపునిస్తున్నానన్నారు.

 భద్రాద్రి పవర్ ప్లాంట్

భద్రాద్రి పవర్ ప్లాంట్

రాబోయే రోజుల్లో కరెంటు కష్టాలు ఉండవని హామీ ఇచ్చారు. చెంతనే గోదావరి ప్రవహిస్తున్నా సమైక్యపాలకుల పక్షపాతధోరణి వల్ల ఖమ్మం జిల్లాలో కరవు మండలాలు కూడా ఉన్నాయని కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

 భద్రాద్రి పవర్ ప్లాంట్

భద్రాద్రి పవర్ ప్లాంట్

వారంరోజుల్లో మరోసారి జిల్లాకు వస్తానని, మూడురోజుల పాటు ఇక్కడే ఉండి అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తానని వెల్లడించారు.

 భద్రాద్రి పవర్ ప్లాంట్

భద్రాద్రి పవర్ ప్లాంట్

ఖమ్మంను తెలంగాణలోనే అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాగా మారుస్తానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హామీ ఇచ్చారు. కాగా, బిల్ట్ కార్మికులు కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సీఎంను కలిసేందుకు పోలీసులు తమను అడ్డుకోవడంతో వారు ఆందోళన చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+