కవిత బెయిల్ తో ముడిపడిన కేసీఆర్ మాస్టర్ ప్లాన్!

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపైన ఎందుకు మాట్లాడటం లేదు? మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని బిజెపిలో విలీనం చేస్తున్నారని జరుగుతున్న ప్రచారం పైన ఆయన నోరు మెదపడంలేదు ఎందుకు? నిజంగానే బిజెపితో కేసిఆర్ రాజీ పడ్డారా? కవిత కోసం కేసీఆర్ సైలెంట్ గా ఉంటున్నారా? మళ్లీ కెసిఆర్ తన మాటలకు పదును పెట్టేది ఎప్పుడు? ఇవి ప్రస్తుతం ప్రతి ఒక్కరిలోనూ మెదులుతున్న ప్రశ్నలు.

త్వరలోనే రంగంలోకి కేసీఆర్
అయితే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సైలెన్స్ వెనుక చాలా పెద్ద కారణం ఉందని బిఆర్ఎస్ వర్గాలలో చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పార్టీ పైన జరుగుతున్న చర్చకు, ప్రజల మనసులో మెదులుతున్న ప్రశ్నలకు కేసీఆర్ గ్రౌండ్ లోకి వచ్చి సమాధానం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని ఆ పార్టీ శ్రేణులలో అంతర్గతంగా ఒక టాక్ నడుస్తుంది.

KCR master plan linked to Kavitha bail

కవితకు త్వరలో బెయిల్

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం లో వచ్చే మంగళవారం కవిత బెయిల్ పిటిషన్ పైన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ డి కౌంటర్ దాఖలు చేయలేదని ఈడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు కవితకు ఈ కేసులో మద్యంతర బెయిల్ ఇచ్చి ఉపశమనం కలిగిస్తారని బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ చాలా గట్టిగా నమ్ముతున్నారు.

కవిత బెయిల్ తో ముడిపడ్డ కేసీఆర్ ప్లాన్
ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రధాన నిందితులుగా ఉన్న మనీషా సిసోడియా,అరవింద్ కేజ్రీవాల్ కు ఈ కేసులో బెయిల్ లభించడంతో కవితకు కూడా తప్పనిసరిగా బెయిల్ వస్తుందని భావిస్తున్నారు. కవితకు బెయిల్ వచ్చిన తర్వాత కొద్దిరోజులకు కేసీఆర్ గ్రౌండ్లోకి దిగుతారని కాంగ్రెస్, బిజెపిలను తూర్పారబడతారని చర్చ జరుగుతుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ బిజెపిలో విలీనం అవుతుందని జరుగుతున్న చర్చకు త్వరలోనే కెసిఆర్ సమాధానం చెబుతారని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.

అప్పటి నుండే కేసీఆర్ దూకుడు
కవితకు బెయిల్ వచ్చిన తర్వాత అటు కాంగ్రెస్ పైన, ఇటు బిజెపి పైన వ్యతిరేకంగా స్వరం వినిపించి, కవిత బెయిల్ కోసం రాజీ పడ్డారనే ముద్రను చెరిపి వేసుకోవడం కోసం కేసీఆర్ దూకుడు రాజకీయాలు చేస్తారని ప్రస్తుతం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కోసం వేసుకున్న మాస్టర్ ప్లాన్ ఇదేనని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది.

కవితకు బెయిల్ వస్తుందా? కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఇదే అంశం ఆధారంగా బిఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా కవిత బెయిల్ కు కేసిఆర్ గ్రౌండ్ లోకి దిగడానికి లింక్ ఉందని పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి కవితకు బెయిల్ వస్తుందా? కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా? తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+