సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ హాజరు కష్టమే.. కారణమిదే!!
తాజాగా జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. నేడు సీఎం గా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం గా భట్టి విక్రమార్క తో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారానికి సిద్ధమయ్యారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట నాలుగు నిమిషాలకు సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయడానికి ముహూర్తం నిర్ణయించగా, ప్రస్తుతం ఎల్బీ స్టేడియంలో హడావిడి కొనసాగుతుంది.
ఇక నేడు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి విపక్ష నేతలు అందరికీ ఆహ్వానం అందగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు సైతం రావాలని ఆహ్వానం పంపించారు. అయితే 10 ఏళ్ల కాలం పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన కేసీఆర్ సీఎం గా రేవంత్ రెడ్డి పట్టాభిషేక కార్యక్రమానికి హాజరవుతారా.. లేదా అన్న చర్చ జోరుగా సాగుతుంది.

కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో ప్రధాన ప్రతిపక్షంగా నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తామని ఇప్పటికే కేటీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అందరిలో సర్వత్ర ఆసక్తి నెలకొంది. బుధవారం సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటించారు. ఇక కెసిఆర్ ప్రస్తుతం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. అయితే వీరిద్దరిలో ఎవరైనా హాజరు ఉంటారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.
సహజంగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రోటోకాల్ ప్రకారం మాజీ ముఖ్యమంత్రి హాజరవుతారు. అయితే కాంగ్రెస్ పార్టీ పైన పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పైన గతంలో కేసీఆర్, కేటీఆర్ లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగాను ఆయనను టార్గెట్ చేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన మంత్రులు, నేతలు కూడా రేవంత్ రెడ్డి పై అనుచితమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి గతంలో మంత్రులుగా పనిచేసిన వారు కానీ, నేతలు కానీ, ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు అయ్యేది లేదని స్పష్టంగా తెలుస్తుంది. తెలంగాణా ప్రజలు ఆయన రాడని బలంగానే నమ్ముతున్నారు.












Click it and Unblock the Notifications