మోడీ హైదరాబాద్‌కు రానున్న వేళ..మంత్రి తలసాని చేతుల్లో కీలక బాధ్యతలు పెట్టిన కేసీఆర్

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. శనివారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. రెండు కార్యక్రమాల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. పఠాన్‌ చెరు సమీపంలోని ఇక్రిశాట్‌ 50వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ముచ్చింతల్‌లోని శ్రీ త్రిదండి చినజీయర్ స్వామివారి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు హాజరవుతారు. సమతామూర్తి శ్రీరామానుజులవారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

శనివారం మధ్యాహ్నం 2.10 నిమిషాలకు ప్రత్యేక విమానంలో ప్రధాని మోడీ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ వెంటనే ప్రత్యేక హెలికాప్టర్‌లో ఇక్రిశాట్ క్యాంపస్‌కు బయలుదేరి వెళ్తారు. సాయంత్రం 4.45 నిమిషాల వరకు ఇక్రిశాట్‌ 50వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4.55 నిమిషాలకు హెలికాప్టర్‌లో మళ్లీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 5 గంటలకు రోడ్డు మార్గంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి ముచ్చింతల్‌కు చేరుకుంటారు.

KCR nominating Minister Talasani Srinivas Yadav to the Minister-in-waiting to receive PM Modi

రాత్రి 8 గంటల వరకు అక్కడే గడుపుతారు. శ్రీరామనుజులవారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. హోమం, ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. రాత్రి 8.20 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమౌతారు. కాగా- మోడీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యతలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. పశు సంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు అప్పగించారు.

Recommended Video

    UP Elections 2022 : UP ఓటర్లకు PM Modi విజ్ఞప్తి..రికార్డుల్ని బ్రేక్ చేసేద్దాం | Oneindia Telugu

    మినిస్టర్ ఇన్ వెయిటింగ్‌గా ఆయన పేరును నామినేట్ చేశారు. ప్రధాని హైదరాబాద్‌కు అడుగు పెట్టడం మొదలుకుని..మళ్లీ తిరుగు ప్రయాణం అయ్యేంతవరకూ ఏర్పాట్లన్నింటినీ దగ్గరుండి పర్యవేక్షించాల్సిన బాధ్యతను తలసాని చేతుల్లో పెట్టారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు. ప్రధాని అరైవల్ అండ్ డిపార్చర్ ఏర్పాట్లను మంత్రి తలసాని పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ నోట్ విడుదల చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+