హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఛీ!: కేసీఆర్‌కి కోపమొచ్చి,రోడ్డుపై కారు దిగి..(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కోపమొచ్చింది! రాజధాని రోడ్డుపై అపరిశుభ్ర వాతావరణం చూసి కేసీఆర్ చలించిపోయారు. కాన్వాయ్ దిగి స్థానికులతో మాట్లాడారు. భద్రత విషయమై ఆందోళన వ్యక్తం చేయగా... అప్పటికప్పుడు సైబరాబాద్ కమిషనర్‌తో కాలనీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయించారు.

ఈ సంఘటన ఆదివారం నాగోల్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం నాగులులోని ఓ ఫంక్షన్ హాలులో నీటి పారుదల విభాగం చీఫ్ ఇంజనీర్ కుమారుడి వివాహానికి హాజరైన కేసీఆర్ తిరిగి వెళ్తూ... మమతానగర్లోని రోడ్డు ఎగుడిదిగుడుగా, అపరిశుభ్రంగా ఉండంటం గమనించారు. కాన్వాయ్ దిగి అక్కడి ప్రజలతో మాట్లాడారు.

కాన్వాయ్ దిగి ప్రజలతో మాట్లాడారు. కాలనీని శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నెలకు ఒక్కసారైనా పారిశుద్ధ్య కార్మికులు రావడం లేదని, ఫాగింగ్ చేయడం లేదని చెప్పారు. దీంతో తాను అధికారులతో మాట్లాడుతానని కేసీఆర్ చెప్పారు. స్థానికంగా కిరాణా దుకాణం నడిపే విజయలక్ష్మి అనే మహిళ గొలుసు చోరీలు పెరిగాయని తెలిపారు. దీంతో వెంటనే కాలనీ సమావేశం నిర్వహించాలని సైబరాబాద్ సీపీని ఆదేశించారు.

కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాగోల్‌లోని మమతానగర్‌లోని ప్రధాన రోడ్డులో కాన్వాయ్ నుండి దిగడంతో గుమికూడిన జనం. చేయి కలిపేందుకు చిన్నా, పెద్దా అందరి ఉత్సాహం.

కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కోపమొచ్చింది! రాజధాని రోడ్డుపై అపరిశుభ్ర వాతావరణం చూసి కేసీఆర్ చలించిపోయారు. కాన్వాయ్ దిగి స్థానికులతో మాట్లాడారు.

కేసీఆర్

కేసీఆర్

భద్రత విషయమై ఆందోళన వ్యక్తం చేయగా... అప్పటికప్పుడు సైబరాబాద్ కమిషనర్‌తో కాలనీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయించారు.

కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం మంత్రులతో, పార్లమెంటరీ కార్యదర్శులతో క్యాంప్ ఆఫీసులో భేటీ అయ్యారు.

కేసీఆర్, దేవీ ప్రసాద్

కేసీఆర్, దేవీ ప్రసాద్

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును టీఎన్జీవోలు క్యాంప్ ఆఫీసులో కలిశారు. దేవీప్రసాద్ కూడా ఉన్నారు.కాగా, దేవీ ప్రసాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. అలాగే పల్లా రాజేశ్వర రెడ్డిని కూడా తెరాస బరిలో దించనుంది.

English summary
Telangana CM KCR in public at Nagole as all gathered around him
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X