వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాగడానికి మంచినీళ్లు కూడా లేని సింగపూర్ శాసిస్తోంది: కెసిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తాగడానికి మంచినీరు లేని సింగపూర్ ప్రపంచాన్ని శాసిస్తోందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాడు అన్నారు. ఎంసీఆర్‌హెచ్ఆర్డీలో ఆగస్టు 15వ తేదీన ప్రారంభించనున్న గ్రామజ్యోతి పథకం పైన కెసిఆర్ సమీక్ష నిర్వహించారు.

సమావేశంలో గ్రామజ్యోతి కోసం ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సంయుక్త కలెక్టర్లు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రజలను భాగస్వామ్యం చేసి పంచాయతీరాజ్ వ్యవస్థలో మార్పు సాధించేలా చూడాలన్నారు.

 KCR review on Grama Jyothi

హైదరాబాద్ కేంద్రంగా పంచాయతీరాజ్ సంస్థల విస్తరణ జరిగిందన్నారు. ఇప్పుడు అలా కావడానికి వీల్లేదన్నారు. ప్రజల సంఘటిత శక్తి బలం ఏమిటో గుర్తించాలన్నారు. ఎవరి ఊరు ఎలా ఉండాలో ప్లాన్ చేసుకునేలా ప్రజలకు నేర్పాలన్నారు.

ప్రజలంతా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రజల భాగస్వామ్యం సాధఇంచి పంచాయతీ రాజ్ వ్యవస్థలో మార్పు సాధించాలన్నారు.

గంగదేవిపల్లి, అంకాపూర్, ములకనూరు సహకార వ్యవస్థలు ఆదర్శమని చెప్పారు. ప్రజలను గ్రామజ్యోతిలో భాగస్వాములను చేయాలన్నారు. గ్రామాలను ప్రజలు పరిశుభ్రంగా ఉంచుకునేలా చేయాలన్నారు. గ్రామజ్యోతిలా పట్టణ జ్యోతి ప్రారంభిస్తామన్నారు.

English summary
Telangana Chief Minister K Chandrasekhar Rao review meeting on Grama Jyothi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X