కేసీఆర్ సంపూర్ణంగా కోలుకోవాలి: పవన్ కళ్యాణ్, సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్

తెలంగాణా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాత్రూంలో జారిపడి, తీవ్ర గాయాల పాలై ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన తుంటి ఎముక విరిగింది అని ఆయనకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని ఇప్పటికే వైద్యులు కెసిఆర్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

ఇక ఇదే సమయంలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు ట్వీట్ చేసింది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆరోగ్య పరిస్థితిని గురించి ఆరా తీయడం జరిగిందన్నారు.

KCR should make a full recovery: Pawan Kalyan, CM Revanth Reddy tweet

ఆసుపత్రిని సందర్శించి, ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదించాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించడం జరిగిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

ఇక ఇదే సమయంలో కేసీఆర్ త్వరగా కోలుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆకాక్షించారు. తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు గారికి గాయమైందని తెలిసి బాధపడ్డానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆయన సంపూర్ణంగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నానని పేర్కొన్నారు.ఎన్నో సవాళ్ళను అధిగమించిన కేసీఆర్ గారు ఈ అనారోగ్య పరిస్థితులనూ మనోధైర్యంతో అధిగమిస్తారనే నమ్మకం ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

పూర్తి స్వస్థత పొంది మళ్ళీ ప్రజలకు, సమాజానికి తన సేవలు కొనసాగిస్తారని ఆశిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ఇవాళ సాయంత్రం కేసీఆర్ కు తుంటి ఎముక రీప్లేస్ మెంట్ చేస్తారని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని తెలిపారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వద్దని, ఆపరేషన్ తర్వాత ఏడు నుండి ఎనిమిది వారాలు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+