కేసీఆర్ నయా యాక్షన్ ప్లాన్ : ఢిల్లీ టు లఖీంపూర్‌ ఖీరీ - భాగ్యనగరంలో డిక్లరేషన్..!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ పైన యుద్దానికి కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. రాజకీయంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న సీఎం కేసీఆర్..రైతు సమస్యలపైన తొలుత తన యాక్షన్ ప్లాన్ తో ముందుకు కదులుతున్నారు. ఇందు కోసం ఢిల్లీ కేంద్రంగా మంత్రాంగం... హైదరాబాద్ లో తీర్మానం దిశగా కార్యాచరణ సిద్దం అయినట్లు తెలుస్తోంది. త్వరలో సీఎం కేసీఆర్ మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్‌ ఖీరీకి వెళ్లేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

లఖీంపూర్‌ ఖీరీ బాధితుల పరామర్శ

లఖీంపూర్‌ ఖీరీ బాధితుల పరామర్శ

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు వాహనం దూసుకువెళ్లటం..రైతులు మృతి చెందటం దేశ వ్యాప్తంగా సంచలనానికి కారణమైంది. ప్రతిపక్షాలు ఈ ఘటన పైన బీజేపీని లక్ష్యంగా చేసుకొని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ఇక, ఇప్పుడు ఆ ఘటనలో బాధిత కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శించేందుకు సిద్దం అయ్యారు.

ఈ నెలలో దాదాపు పది రోజుల పాటు సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఢిల్లీలో నిర్వహించిన దీక్షలో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ పాల్గొన్నారు. రైతు సంఘాల నేత రాకేశ్‌ తికాయత్‌ సైతం ఆ దీక్షకు హాజరయ్యారు.

ఢిల్లీ - హైదరాబాద్ కేంద్రంగా సమావేశాలు

ఢిల్లీ - హైదరాబాద్ కేంద్రంగా సమావేశాలు

మరుసటి రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో తామే ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించిన కేసీఆర్..త్వరలో మరోసారి ఢిల్లీ వెళ్లనున్నట్లు వెల్లడించారు. ఈ సారి టూర్ లో పలువురు ఆర్థికవేత్తలు, రైతు సంఘాల ప్రతినిధులతో కేసీఆర్‌ భేటీ కానున్నారు. ఇప్పటికే ఆర్దిక - వ్యవసాయ రంగానికి చెందిన కొందరు నిపుణులతో సమావేశాలు జరిగినట్లు కేసీఆర్ స్వయంగా చెప్పుకొచ్చారు.

దేశంలో కళకళలాడాల్సిన వ్యవసాయం వెలవెల బోతోందని చెప్పారు. దేశంలో కొత్త రైతాంగ విధానం అవసరమని పదే పదే చెబుతున్న కేసీఆర్ ఆ దిశగా.. కీలక రైతు సంఘాలు...నిపుణులతో చర్చలు చేస్తున్నారు. వారిని హైదరాబాద్ కు ఆహ్వానించాలని నిర్ణయించారు.

రాష్ట్రపతి ఎన్నికతో రాజకీయం మొదలు

రాష్ట్రపతి ఎన్నికతో రాజకీయం మొదలు

అక్కడే జాతీయ స్థాయి వర్క్ షాప్ ఏర్పాటు చేసి.. ఇంటిగ్రేటెడ్‌ న్యూ అగ్రికల్చర్‌ పాలసీని డిక్లేర్‌ చేసే విధంగా అడుగులు వేస్తున్నారను. ఇక, రాజకీయంగా కేంద్రం పైన పోరాటం... బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించటంలో భాగంగా.. మరోసారి మహారాష్ట్రకు వెళ్లి ఎన్‌సీపీ నేత శరద్‌ పవార్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

అదే విధంగా పూణే పర్యనటకు సీఎం వెళ్లనున్నట్లు చెబుతున్నారు. అయితే ,రాష్ట్రపతి ఎన్నికల సమయంలోనే ఎన్డీఏకు జలక్ ఇవ్వాలనేది కేసీఆర్ ఆలోచనగా సమాచారం. ఇందుకోసం రాష్ట్రపతి ఎన్నికల నుంచే బీజేపీ వ్యతిరేక పార్టీలు కలిసి పని చేసేలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు తెలంగాణతో పాటుగా జాతీయ రాజకీయాల్లోనూ క్రీయాశీలకంగా వ్యవహరించేందుకు సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+