ఓటుకు నోటు ప్రాసెస్‌లో ఉంది, ఎవరినీ వదిలిపెట్టం: బాబు-రేవంత్‌కు కేసీఆర్ ఝలక్

హైదరాబాద్: బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు దొందు దొందేనని, వంద శాతం తాము మేనిఫెస్టో అమలు చేశామని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం చెప్పారు. టీఆర్ఎస్ఎల్పీగా ఎన్నికైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనను టీఆర్ఎస్ఎల్పీగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు చెప్పారు.

జర్నలిస్టులకు అన్ని రకాలుగా తాము మేలు చేస్తామని చెప్పారు. రాష్ట్ర, జిల్లాస్థాయి జర్నలిస్టులకు త్వరలో ఇల్లు ఇస్తామని చెప్పారు. గత ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన అన్నింటిని అమలు చేసిన ఘనత తమదేనని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పారు. కేబినెట్లో అన్ని వర్గాలకు అవకాశాలు ఉంటాయని చెప్పారు. రైతు బంధు దేశవ్యాప్తంగా అమలు చేస్తే రూ.3.50 లక్షల కోట్లు అవుతాయని చెప్పారు.

Recommended Video

    KCR Press Meet : KCR Says I will Make Changes In This Country In One Month | Oneindia Telugu

    రెండు పార్టీలు వరస్ట్

    రెండు పార్టీలు వరస్ట్

    బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తేడా లేదని చెప్పారు. రెండు పార్టీలు వరస్ట్ అన్నారు. వారి సైకాలజీ బాగా లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వద్ద కూడా మాటలు తప్ప ఏదీ లేదన్నారు. జాతీయస్థాయి రాజకీయాల్లో కొత్త ప్రయోగాలు చేస్తామని అన్నారు. కేంద్రం తాను చేయాల్సిన పని చేయకుండా రాష్ట్రాలపై పెత్తనం చెలాయిస్తుందని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే అన్నారు. దేశానికి ఒక కొత్త ఆర్థిక, వ్యవసాయ విధానం అవసరమని చెప్పారు. కేంద్రం తాను చేయాల్సిన పని చేయకుండా రాష్ట్రాలపై పెత్తనం చెలాయిస్తోందన్నారు. ఓట్ల కోసం జాతీయ నేతలు అబద్దాలు ఆడుతున్నారని చెప్పారు. జాతీయ పార్టీలు చిల్లరమల్లర రాజకీయాలు చేస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినా రాష్ట్రానికో పాలసీ ఉందని చెప్పారు. ఓట్ల కోసం రాహుల్ గాంధీ అబద్దాలు చెబుతున్నారని చెప్పారు.

     ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పలేదు

    ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పలేదు

    రాష్ట్రాలపై అనవసర పెత్తనం విషయంలో కేంద్రం ఆలోచించాలని కేసీఆర్ చెప్పారు. తాను తప్పకుండా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తానని చెప్పారు. పచ్చి అవకాశవాద రాజకీయాలు చేసే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఖతం చేయాలన్నారు. ఇంటికి ఒక ఉద్యోగం తాను ఇస్తానని ఎప్పుడూ చెప్పలేదన్నారు. అనవసరంగా నిరుద్యోగులను రెచ్చగొట్టవద్దని సూచించారు. కోర్టు ఆదేశాల మేరకు రాబోయే వారం రోజుల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

    ఫెడరల్ ఫ్రంట్ ద్వారా రైతు బంధు

    ఫెడరల్ ఫ్రంట్ ద్వారా రైతు బంధు

    ఫెడరల్ ఫ్రంట్ ద్వారా రైతు బంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని కేసీఆర్ చెప్పారు. భారీ మెజార్టీతో గెలిచినందుకు తెలంగాణ రాష్ట్ర పరపతి పెరిగిందని చెప్పారు. విపక్షాలు అబద్దాలు చెబుతున్నాయని అన్నారు. మా మేనిఫెస్టోను తాము వంద శాతం అమలు చేస్తామని అన్నారు. తాను రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశముందని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశాక ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పారు.

    ఎవరినీ వదిలిపెట్టం, ప్రాసెస్‌లో ఓటుకు నోటు కేసు

    ఎవరినీ వదిలిపెట్టం, ప్రాసెస్‌లో ఓటుకు నోటు కేసు

    ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వల్ల వచ్చేదేమిటి, సచ్చేదేమిటి అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ బుధవారం చెప్పారు. హోదా విషయంలో చంద్రబాబుకే స్పష్టమైన వైఖరి లేదని, అలాంటప్పుడు తాను ఏం చెబుతానని అన్నారు. విపక్ష నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈసారి ఎవరినీ వదిలి పెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఓటుకు నోటు కేసు ప్రాసెస్‍‌లో ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

    గవర్నర్‌ను కలిసిన టీఆర్ఎస్

    గవర్నర్‌ను కలిసిన టీఆర్ఎస్

    కేసీఆర్ టీఆర్ఎస్ఎల్పీగా ఎన్నికైన అనంతరం ఆ పార్టీ నేతలు ఇందుకు సంబంధించిన లేఖను గవర్నర్ నరసింహన్‌కు అందించారు. తెరాస సభ్యులు ఇచ్చిన లేఖను గవర్నర్ ఆమోదించారు. కేసీఆర్‌ను టీఆర్ఎస్ఎల్పీగా ఎన్నుకున్నట్లు వారు తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+