కారు గేర్ మార్చిన కేసీఆర్: గేమ్ ఛేంజ్- ఈ నెల 19న..!!

భారత్ రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై సమరభేరి మోగించనున్నారు. కృష్ణా గోదావరి జలాలు సహా రాష్ట్రం ఎదుర్కొంటోన్న సమస్యలపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధపడుతున్నారు. దీనికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఈనెల 19వ తేదీన బీఆర్ఎస్ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశంలో ఆయా అంశాలు చర్చకు రానున్నాయి.

19న మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో ఈ భేటీ ఏర్పాటైంది. దీనికి కేసీఆర్ అధ్యక్షత వహించనున్నారు. కృష్ణా గోదావరి జలాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను కాంగ్రెస్ సర్కార్ విస్మరించిందని, ఫలితంగా రాష్ట్రం మరోసారి ఎడారిగా మారుతుందనేది బీఆర్ఎస్ వాదన. ప్రభుత్వం చూపిస్తోన్న ఈ నిర్లక్ష్య వైఖరి మీద బీఆర్ఎస్ చర్చించబోతోంది. గోదావరి కృష్ణా జలాలను ఏపీ కొల్లగొడుతున్నా దాన్ని అడ్డుకునే విషయంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఇటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజల రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమం తప్పదని భావిస్తోంది.

KCR to Launches Movement for Water Allocation to Telangana

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు తమ ప్రభుత్వం 91 టీఎంసీలు కేటాయిస్తే.. దీన్ని 45 టీఎంసీలు ఇస్తే చాలు అని రేవంత్ సర్కార్ కేంద్రం అంగీకారం తెలపడ పట్ల కేసీఆర్ మండిపడుతున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కేంద్రం ముందు మోకరిల్లడం రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేయడమేనని ఆయన విమర్శిస్తోన్నారు.

పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ ప్రజలు, రైతాంగ ప్రయోజనాలు దెబ్బతింటున్న నేపథ్యంలో, తెలంగాణ నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా ఒక్కరూ మాట్లాడిన పాపాన పోవట్లేదని, స్వయంగా ఆ పార్టీనే రైతాంగ ప్రయోజనాలకు గండి కొడుతోందని బీఆర్ఎస్ చెబుతోంది. తెలంగాణకు సాగునీటి విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని కానీ, కావేరి తదితర నదుల అనుసంధానం పేరుతో ఏపీ జలదోపిడికి సహకరిస్తున్న కేంద్ర బీజేపీ విధానాన్ని గాని ఎదుర్కోవాలంటే ప్రత్యక్ష పోరాటాలే శరణ్యమని కేసీఆర్ భావిస్తున్నారు.

రెండేళ్లు గడిచినా తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంకా సమాజం మౌనం వహించడం సరికాదని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు, కృష్ణా జలాలలో 45 టీఎంసీలు ఒప్పుకోవడం పట్ల పోరు తప్పదని, రైతాంగ ప్రయోజనాలను కాపాడే విషయంలో ఎన్నటికీ రాజీ పడబోమని కేసీఆర్ తేల్చి చెబుతున్నారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం, ఏపీ జలదోపిడిపైన పోరాడటానికి ఓ ఉద్యమ స్వరూపానికి శ్రీకారం చుట్టనుంది బీఆర్ఎస్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+