కేసీఆర్ vs రాహుల్ గాంధీ vs పీఎం మోడీ: పీక్స్ లో తెలంగాణా ప్రచారపర్వం!!

తెలంగాణా రాష్ట్రంలో ప్రచార పర్వం పీక్స్ లో కొనసాగుతుంది. జాతీయ పార్టీలు జాతీయ స్థాయి నేతలను రంగంలోకి దింపి ప్రచారం సాగిస్తున్నాయి. బీజేపీ మోడీ, అమిత్ షా వంటి దిగ్గజ నేతలను, కాంగ్రెస్ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వంటి నాయకులను, బీఆర్ఎస్ కేసీఆర్, కేటీఆర్ లతో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తుంది.

ఇక ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు హైదరాబాద్‌ వస్తారు. బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో నరేంద్రమోదీ ప్రసంగిస్తారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న నేపథ్యంలో మోదీ పాల్గొనే రెండవ బహిరంగ సభ ఇది.

KCR vs Rahul Gandhi vs PM Modi: Telangana Campaign in Peaks!!

కాగా తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా బీజేపీ సీనియర్ నాయకులు రాష్ట్రానికి వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఇదిలావుండగా అధికార బీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. 40 నియోజక వర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రసంగించిన బీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు నిన్నటితో తొలి దశ ప్రచారాన్ని పూర్తి చేశారు.

దాదాపు 50 నియోజకవర్గాల్లో ఈ నెల 13 నుంచి రెండవ దశ ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొంటారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారక రామారావు రోడ్‌ షోలు నిర్వహిస్తుండగా, పార్టీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. ఇదిలా ఉండగా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో సహా కాంగ్రెస్ ప్రముఖ ప్రచారకర్తలు దీపావళి తర్వాత రాష్ట్రంలో మరోసారి ప్రచారాన్ని చేపట్టనున్నారు.

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో అధికార బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. కొన్ని నియోజకవర్గాలలో బహుముఖ పోటీ జరుగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల తుది జాబితా విడుదల చేశాయి. నామినేషన్ల దాఖలకు ఈరోజు చివరి రోజు. ఈ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన అనంతరం ఈనెల 15తో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. ఈనెల 30న పోలింగ్ నిర్వహిస్తారు.ఇప్పటికే దాదాపు నామినేషన్ లను దాఖలు చేసిన అభ్యర్థులు ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+