గౌరవనీయ కేసీఆర్ గారు.. దుప్పటి మడతపెట్టి వచ్చారే!!
తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎట్టకేలకు రెండు సంవత్సరాల తర్వాత దుప్పటి మడతపెట్టి బయటకు వచ్చారని రాజకీయ విమర్శకులు తమ విమర్శలకు పదును పెట్టారు. ఎందుకంటే.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించుకుంటే మళ్లీ బీఆర్ఎస్ కు జవసత్వాలు కూడగట్టినట్లు అవుతుందని, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ వస్తుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వొచ్చని ఆయన భావిస్తున్నారు.
విమర్శకులు దుప్పటి మడతపెట్టి వచ్చారని ఎందుకు అంటున్నారంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు కాబట్టి అసెంబ్లీకి రావడం ఇష్టం లేక, లోక్ సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా రాకపోవడం, కాళేశ్వరం అవినీతి, ఫోన్ ట్యాపింగ్.. తదితర అంశాలుండటంతో ఫామ్ హౌస్ లో పడుకున్నారని అర్థం వచ్చేలా చెబుతున్నారు.

రౌడీషీటర్ ను నిలబెడతారా?
జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ రౌడీషీటర్ ను బరిలో నిలబెట్టిందని, అతన్నిచదువుకున్న ప్రజలు కచ్చితంగా తిరస్కరిస్తారని కేసీఆర్ అంటున్నారు. సునీతను గెలిపించుకోవానే ఉద్దేశంతో ఇక్కడి ప్రజలున్నారన్నారు. కొంతమంది ముఖ్యమైన నేతలను, కార్యకర్తలను తన ఫామ్ హౌస్ కు పిలిపించుకొని మాట్లాడారు. అంతేకానీ ఆయన మాత్రం బయటకు రావడంలేదు.
కేటీఆర్ అయితే కష్టమని..
బీఆర్ఎస్ కు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న కేటీఆర్ అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీని గెలిపించడలేడని కేసీఆర్ భావిస్తున్నారంటున్నారు. అందుకే ఆయన రంగంలోకి దిగారు. రాజకీయాలలో రౌడీషీటర్లను తిరస్కరించాలని పిలుపునిచ్చారు. మరి కేసీఆర్ పార్టీలో ఎంతమంది రౌడీషీటర్లు లేరో ఆయనకు తెలియదంటారా?
అన్నీ పర్యవేక్షిస్తాను
మాగంటి సునీతకు రాజకీయ అనుభవం లేకపోవడంతో కేటీఆర్, హరీష్ రావు క్షేత్ర స్థాయిలో కూడా పనులు చూసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. అసమర్థ పాలనతో రాష్ట్రం భ్రష్టుపట్టిపోయిందని, కచ్చితంగా 30వేల ఓట్ల మెజారిటీతో తాము గెలువబోతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ప్రతిరోజు నాయకులంతా ఎలా పనిచేస్తున్నారో తాను పర్యవేక్షిస్తానని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications