బాబుకు నోటీసుపై ఏసీబీ చీఫ్‌తో కేసీఆర్, ఏం చేద్దాం: ఏపీ సీఎం
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారం రోజురోజుకు ఉత్కంఠగా కనిపిస్తోంది. తాజాగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏసీబీ చీఫ్‌తో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించారు.
కేసీఆర్ ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌తో సమావేశమయ్యారు. ఓటుకు నోటు కేసులో పురోగతి పైన ఆయనతో కేసీఆర్ చర్చించారు. ఈ సమావేశంలో నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడం, తదితర అంశాల పైన చర్చించారని కూడా తెలుస్తోంది.

ఫోన్ సంభాషణల పైన కూడా చర్చించారు. రెండు మూడు రోజుల్లో చంద్రబాబుకు నోటీసులు ఇస్తున్నారనే వార్తల నేపథ్యంలో వీరి భేటీక్ ప్రాధాన్యత ఏర్పడింది. నోటీసులు ఇస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే అంశంపై వీరు చర్చించారని తెలుస్తోంది.
మరోవైపు, చంద్రబాబు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, డీజీపీ జేవీ రాముడు సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పైన నమోదైన కేసుల పైన సమావేశంలో చర్చించారని తెలుస్తోంది. అలాగే, నోటీసులు ఇస్తే ఎలా ఎదుర్కోవాలనే విషయమై కూడా చర్చించారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications