రూ.వందల కోట్ల నుంచి రూ.15 కోట్లకు పడిపోయిన కేసీఆర్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి దేశంలోనే అత్యంత సంపన్న పార్టీగా నిలిచింది. అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ.. ఆ పార్టీ నాయకులు చెలాయించిన అధికారం, చూపించిన దర్పం చూసి తెలంగాణ ప్రజలే ఆశ్చర్యపోయారు. అటువంటి పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కసారిగా కుదేలైపోయింది. చివరకు కార్యకర్త కూడా పట్టించుకోవడంలేదు. దీనికి కారణం.. కేసీఆర్ వ్యవహారశైలి.. కేటీఆర్ మాటలు. ఈ రెండే ప్రధాన కారణాలుగా మారి బీఆర్ఎస్ ఊపిరి ఉంటుందా? లేదా? అనే పరిస్థితికి తీసుకొచ్చాయి.

ఆ డబ్బులన్నీ ఏమయ్యాయో?
అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీకి విరాళాలు ఇవ్వడానికి కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు పోటీపడ్డారు. ఒకరిని మించి ఒకరు విరాళాలిచ్చేవారు. లేదంటేవారి వ్యాపారాలను ఇబ్బందులకు గురిచేస్తామని పరోక్షంగా హెచ్చరించేవారు. ఎందుకొచ్చిన తలనొప్పిలే అనుకున్నవారంతా విరాళాల కింద సమర్పించుకునేవారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం హుండీలా బీఆర్ఎస్ కళకళలాడేది. మరి ఆ డబ్బులన్నీ ఏమయ్యాయో ఏమిటో తెలియదు. అడిగితే ఎన్నికల్లో ఖర్చు పెట్టేశామంటున్నారు. దీంతో ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు.

KCR s fortune has dropped from hundreds of crores to Rs 15 crores

కళకళలాడిన పార్టీ బోసిపోయింది
2023-24లో బీఆర్ఎస్ కు 581 కోట్ల రూపాయలు విరాళంగా వచ్చాయి. వీటిల్లో ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వచ్చినవి 496 కోట్ల రూపాయలు ఉన్నాయి. అదే 2022-23లో 684 కోట్లు వచ్చాయి. అన్ని కోట్ల రూపాయలతో కళకళలాడిన ఆ పార్టీవైపు ఇప్పుడు కనీసం చిన్న వ్యాపారస్తుడు కూడా కన్నెత్తి చూడటంలేదు. కాంట్రాక్టర్లు కానీ, రాజకీయ నేతలు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ.. ఇలా ఎవరూ ఒక్క రూపాయి కూడా ఇవ్వడంలేదు. రాజ్యసభ సభ్యులు, అజ్ఞాత వ్యక్తులైతే అసలు పట్టించుకోవడంలేదు.

దీంతో నిత్య కల్యాణం పచ్చతోరణంలా ఉండే ఆ పార్టీ ఇప్పుడు బోసిపోయింది. 2024-25లో 15 కోట్ల రూపాయలు మాత్రమే విరాళంగా వచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందజేసింది. కుమార్తెను పార్టీ నుంచి గెంటేశారు. కేటీఆర్ చేతుల్లో పార్టీ పెట్టారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుస్తామా? లేదా? అనే అనుమానంతో మొన్నే కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అక్కడ కూడా ఓడిపోతే వచ్చే సంవత్సరం ఆ 15 కోట్ల రూపాయలు కూడా వచ్చేలా కనపడటంలేదు..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+